Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ టాలెంట్ కు ఇది మరో నిదర్శనం

ఇప్పుడు తాజాగా సైమా అవార్డ్స్ లో మరోసారి కన్నడ కాంతార హీరో రిషభ్ శెట్టితో కలిసి కన్నడలో అద్భుతంగా మాట్లాడి మెస్మరైజ్ చేశారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 12:38 PM GMT
ఎన్టీఆర్ టాలెంట్ కు ఇది మరో నిదర్శనం
X

దుబాయ్‌ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక గ్రాండ్ గా జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం తొలి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన తారలు మెరిశారు. అయితే ఈ వేడుకలు బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

తన హ్యాండ్సమ్ లుక్స్, స్టేజ్ పై అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ స్పీచ్ .. ఇలా అన్నింటిలోనూ హైలైట్ గా నిలిచారు తారక్. అయితే ఆయన ఎంతటి ప్రతిభావంతులో తెలిసిన విషయమే. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఒకరు. అంతేకాదు సింగిల్‌ టేక్‌లో భారీ డైలాగ్స్ ను గుక్క తిప్పుకోకుండా చెప్పగలరు.

అలాగే ఆయనకు దాదాపు తొమ్మిది భాషల వరకు వచ్చంటారు. అప్పట్లో RRR ప్రమోషన్స్ సమయంలోనూ దేశంలో ఎక్కడికి వెళ్తే అక్కడి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలు మాట్లాడి ఇంప్రెస్ చేరు ఎన్టీఆర్. అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ జపాన్ వెళ్లినప్పుడు జపనీస్ లో, ఆస్కార్ కోసం హాలీవుడ్ కు వెళ్లినప్పుడు అక్కడి యాసలో ఇంగ్లీష్ మాట్లాడి ఆకట్టుకున్నారు.

ఇప్పుడు తాజాగా సైమా అవార్డ్స్ లో మరోసారి కన్నడ కాంతార హీరో రిషభ్ శెట్టితో కలిసి కన్నడలో అద్భుతంగా మాట్లాడి మెస్మరైజ్ చేశారు. వేదికపై అవార్డు అందుకున్న రిషభ్ శెట్టి.. కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ కు స్పెషల్ కంగ్రాట్స్ చెబుతూ అభినందించాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న హోస్ట్ తారక్ వద్దకు వెళ్లగా.. ఎన్టీఆర్ – రిషభ్ శెట్టిల మధ్య కన్నడ భాషలో ఆసక్తికర సంభాషణ జరిగింది.

ఒకరి సినిమాల గురించి మరొకరు పొగుడుకున్నారు. అవార్డ్స్ అందుకున్నందుకు ఒకరి నొకరు అభినందించుకున్నారు కూడా. అలా ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.