కాంతార హీరోపై సితార స్పెషల్ పోస్ట.. ఎంటీ మ్యాటర్?
ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి చెప్పాలంటే, ఇటీవల వరుస విజయాలతో టాలీవుడ్‌లో ప్రీమియం బ్యానర్‌గా మారింది
By: Tupaki Desk | 7 July 2025 8:10 PM ISTకన్నడ సినిమా స్థాయిని ఒక్కసారిగా మార్చేసిన సినిమా ‘కాంతార’. ఈ చిత్రంతో రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. తన గొప్ప కథనశైలి, నటనతో ప్రేక్షకులను మెప్పించిన రిషబ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ‘కాంతార: చాప్టర్ 1’తో బిజీగా ఉన్నప్పటికీ, టాలీవుడ్‌లోనూ బిజీ అయ్యే ప్లాన్ చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే జై హనుమాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తాజాగా రిషబ్ శెట్టి బర్త్‌డే సందర్భంగా ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. "పవర్‌హౌస్ పెర్ఫార్మర్ రిషబ్ శెట్టి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బలమైన కథలు, అద్భుతమైన నటనతో అందరినీ ప్రభావితం చేస్తూ ఉండండి" అంటూ పోస్ట్ చేశారు.
ఈ విషెస్ కేవలం ఫార్మాలిటీ కాదని, ఇందులో ఓ హింట్ ఉందని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ త్వరలో రిషబ్ శెట్టితో ఓ తెలుగు సినిమా ప్లాన్ చేస్తుందట. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ విషయంలో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయని టాక్. రిషబ్ శెట్టి దర్శకత్వంలోనేనా? లేక తాను నటించే చిత్రమా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇది భారీ స్థాయిలో ఉండబోతుందన్న అంచనాలు మాత్రం ఉన్నాయి.
ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి చెప్పాలంటే, ఇటీవల వరుస విజయాలతో టాలీవుడ్‌లో ప్రీమియం బ్యానర్‌గా మారింది. ఈ కాంపౌండ్ లోని సినిమాలు నాణ్యతతో పాటు కొత్తదనం పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి సంస్థ నుంచి రిషబ్ శెట్టి వంటి విలక్షణ నటుడితో సినిమాకు ప్రణాళికలు ఉన్నాయంటే, అది సాధారణ సినిమా కాదనే అర్థం అవుతుంది.
తెలుగు ప్రేక్షకులకు ‘కాంతార’ ఎంతగా నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే రిషబ్ శెట్టి తెలుగు సినిమాలో కనిపిస్తే, ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి. పైగా సితార బ్యానర్ నుంచి వస్తోంది కాబట్టి, టాప్ హీరోలతో కాంబో ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
