ఆ బయోపిక్ లో రిషబ్ శెట్టి? హిస్టరీ రిపీటా?
ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 14 July 2025 2:00 AM ISTస్టార్ యాక్టర్ రిషబ్ శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. కాంతార మూవీతో దేశవ్యాప్తంగా వేరే లెవెల్ ఫేమ్ సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. వివిధ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మరిన్ని చిత్రాలు లైన్ లో పెడుతున్నారు. ఇప్పుడు మరో క్రేజీ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఆ మూవీని రూపొందించనున్నారని.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది. అయితే పానిపట్, జోధా అక్బర్, మొహెంజోదారో, లగాన్ వంటి చారిత్రక సినిమాలను అశుతోష్ గోవారికర్ తెరకెక్కించారు. ఆల్ టైమ్ క్లాసిక్స్ అందించారు. కానీ కొన్నాళ్లపాటు దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు రాయలవారి బయోపిక్ తీయనున్నారట.
అయితే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు బయోపిక్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పాడ్డాయని చెప్పాలి. రిషబ్ శెట్టికి బంపర్ ఆఫర్ వచ్చిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు కొందరు నటులు మాత్రమే.. సినిమాల్లోని శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.
స్వర్గీయ ఎన్టీఆర్ మహామంత్రి తిమ్మరుసులో శ్రీ కృష్ణ దేవరాయలుగా కనిపించి మెప్పించారు. ఓ రేంజ్ లో అలరించారు. ఆ తర్వాత ఆదిత్య 369లో బాలయ్య సందడి చేశారు. తన యాక్టింగ్ తో వేరే లెవెల్ లో ఆకట్టుకున్నారు. రీసెంట్ గా ప్రముఖ నటుడు శ్రీకాంత్.. దేవరాయ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ హిట్ ను అందుకోలేకపోయారు.
ఇప్పుడు రిషబ్ శెట్టి ఎలాంటి హిట్ అందుకోనున్నారని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. హిస్టరీ రిపీట్ చేస్తారా అని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఆయన.. క్రేజీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. కాంతార చాప్టర్ 1లో నటిస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో రాబోతున్న మూవీలో కనిపించనున్నారు. హనుమాన్ సీక్వెల్ లో సందడి చేయనున్నారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
