గ్రేట్ పవర్.. గ్రేట్ రెస్పాన్సిబిలిటీ.. రిషబ్ చెప్పిన స్పైడర్ మ్యాన్ స్టోరీ!
ఈ నేపథ్యంలో నేషనల్ అవార్డు విన్నర్, కాంతార స్టార్ రిషబ్ శెట్టి తో చేసిన స్పెషల్ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.
By: Tupaki Desk | 27 July 2026 11:24 AM ISTమార్వెల్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న స్పైడర్- మ్యాన్: బ్రాండ్ న్యూ డే రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ అవార్డు విన్నర్, కాంతార స్టార్ రిషబ్ శెట్టి తో చేసిన స్పెషల్ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్‌తో రిషబ్ శెట్టి సరదాగా కనిపించడంతో పాటు, తన జ్ఞాపకాలను ఫ్యాన్స్ తో పంచుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో మార్వెల్ ఫ్యాన్స్‌తో పాటు ఇండియన్ సినీ ఆడియన్స్‌లోనూ ఈ సినిమా గురించి మరింత డిస్కషన్ మొదలైంది.
తనకు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ తో ఉన్న బాండింగ్ ను వివరిస్తూ రిషబ్ శెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని వెల్లడించారు. చాలా సంవత్సరాల క్రితం ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో మొదటిసారి స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికీ తనకు చాలా బాగా గుర్తుందని చెప్పారు. ఆ సినిమా చూసిన వెంటనే పీటర్ పార్కర్ క్యారెక్టర్ తో తాను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని పేర్కొన్నారు. సాధారణంగా సూపర్ హీరోలు అన్నీ చేయగలిగే శక్తివంతులుగా కనిపిస్తారని, కానీ స్పైడర్ మ్యాన్ మాత్రం తప్పులు చేసే, అపజయాలను ఎదుర్కొనే, జీవితంలోని కష్టాలను అనుభవించే సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఆ పాత్రలోని అసలు గొప్పతనమని వివరించారు.
స్పైడర్ మ్యాన్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే కారణం అతని సూపర్ పవర్స్ మాత్రమే కాదు, అతని వ్యక్తిత్వం కూడా అని రిషబ్ శెట్టి అభిప్రాయపడ్డారు. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా బాధ్యతతో ముందుకు సాగడం, వ్యక్తిగత సమస్యలు ఉన్నా సమాజం కోసం నిలబడడం వంటి అంశాలు ప్రతి తరానికి స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు. ముఖ్యంగా గొప్ప శక్తి వస్తే దానికి తగిన బాధ్యత కూడా వస్తుందనే స్పైడర్ మ్యాన్ మెసేజ్ కేవలం సినిమా వరకే పరిమితం కాకుండా జీవితంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన గొప్ప పాఠమని ఆయన పేర్కొన్నారు.
రిషబ్ శెట్టి పాల్గొన్న ఈ స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ద్వారా స్పైడర్- మ్యాన్ బ్రాండ్ న్యూ డే పై ఇండియన్ ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశీయంగా మంచి ఆదరణ ఉన్న రిషబ్, మార్వెల్ సినిమాను ప్రమోట్ చేయడం ద్వారా ప్రాంతీయ, అంతర్జాతీయ సినిమా ప్రపంచాల మధ్య ఉన్న అనుబంధం మరోసారి స్పష్టమైంది. ఒకవైపు తన యాక్టింగ్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి, మరోవైపు ఫేవరెట్ హీరోపై తన ప్రేమను ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడం ఈ ప్రమోషన్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. సినిమా రిలీజ్ కు ముందే ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ సినిమా జులై 30న ఇండియాలో రిలీజ్ కానుంది.
