Begin typing your search above and press return to search.

ఈవెంట్ లో నో తెలుగు.. ఇప్పుడు హిందీలో క్లారిటీ!

తాను ఎక్కువగా కన్నడలో ఆలోచిస్తాను కాబట్టి సహజంగానే ఆ భాషలో మాట్లాడానని తెలిపారు. కానీ ప్రతి భాషను తానెప్పుడూ గౌరవిస్తానని చెప్పారు.

By:  Tupaki Desk   |   30 Sept 2025 1:23 PM IST
ఈవెంట్ లో నో తెలుగు.. ఇప్పుడు హిందీలో క్లారిటీ!
X

కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమా.. అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఆ మూవీ.. తెలుగులోనూ విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ కు రాగా.. రిషబ్ సహా పలువురు హాజరయ్యారు. ఈవెంట్ లో భాగంగా మొత్తం కన్నడలోనే మాట్లాడారు రిషబ్ శెట్టి. దీంతో టాలీవుడ్ అభిమానులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేశారు.

అది అసలు కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు తమిళంలో మాట్లాడే రిషబ్.. ఇప్పుడు ఎందుకు తెలుగులో మాట్లాడకపోవడం కరెక్ట్ కాదని అన్నారు. దీంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు ఓ కార్యక్రమంలో రిషబ్ శెట్టి రెస్పాండ్ అయ్యి పలు వ్యాఖ్యలు చేశారు.

తాను ఎక్కువగా కన్నడలో ఆలోచిస్తాను కాబట్టి సహజంగానే ఆ భాషలో మాట్లాడానని తెలిపారు. కానీ ప్రతి భాషను తానెప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. ఎక్కడికైనా వెళితే, ఆ ప్రాంత భాషకు గౌరవం ఇవ్వడం అవసరమని తెలిపారు. కొన్నిసార్లు తన ఉద్దేశం తప్పుగా ప్రజెంట్ అవుతుందని అన్నారు. భాషలన్నింటినీ గౌరవిస్తానని పేర్కొన్నారు.

తాను కన్నడిగుడిని అని చెప్పుకోవడం తనకు గర్వంగా ఉందని తెలిపారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆ క్లారిటీ అంతా రిషబ్ హిందీలోనే ఇచ్చారు. బాలీవుడ్ మీడియాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో స్పందిస్తూ హిందీలో స్పష్టంగా మాట్లాడారు. కానీ ఈవెంట్ లో తెలుగు మాట్లాడకపోవడమే వివాదానికి కారణం.

ఇక కాంతార ప్రీక్వెల్ మూవీ విషయానికొస్తే.. రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్‌మెంట్, యాక్షన్, సస్పెన్స్‌ తో ఆకట్టుకుంటుంద‌ని హామీ ఇస్తున్న మేకర్స్.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.