ఆకాశవాణితో పాన్ ఇండియా స్టార్!
'కాంతార'తో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకున్నాడు.
By: Tupaki Desk | 16 July 2025 2:00 AM IST'కాంతార'తో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఆసినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించి తొలి సినిమాతోనే టాలీవుడ్ లో పెద్ద స్టార్గా ఎదిగాడు. ఇప్పుడతడితో బడా నిర్మాణ సంస్థలే సినిమాలు నిర్మిస్తున్నాయి. `కాంతార చాప్టర్ వన్` కోసం హోంబలే ఫిల్మ్స్ 200 కోట్లు ఖర్చు చేస్తుందంటే రిషబ్ శెట్టిని వాళ్లెంతగా నమ్మారు ? అన్నది అద్దం పడుతుంది.
అలాగే `హనుమాన్` సీక్వెల్ గా రూపొందుతున్న `జైహమనుమాన్` లో నటిస్తున్నాడు. ఎంతో మంది నటులు ఉన్న ప్రశాంత్ వర్మ ఏరి కోరి మరీ రిషబెట్ శెట్టిని తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ లో `ఛత్రపతి శివాజీ మహరాజ్` స్టోరీని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయంటే? కేవలం అతడిలో ఉన్న ప్రతిభతోనే అన్నది సుస్పష్టం. స్టోరీలు..పాత్రల పరంగా రిషబ్ శెట్టి థింకింగ్ ప్రోసస్ యూనిక్ గా ఉంటుంది.
రొటీన్ సినిమాలు...రెగ్యులర్ కమర్శియల్ చిత్రాలకు భిన్నంగా ప్రయత్నించం అతడు ప్రత్యేకత. అందుకే అతడిని నమ్మి నిర్మాతలు వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. సాధారణంగా పెద్ద స్టార్ అయితే తప్ప ఇంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయరు. కానీ రిషబ్ శెట్టి మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ. నటనతో పాటు డైరెక్షన్ చేస్తాడు. సొంతంగా కథల్ని తానే రాసుకుంటాడు. ఇలాంటి క్వాలిటీలు ఉన్న రేర్ ఆర్టిస్ట్ కావడంతో నిర్మాతలు నమ్మకంగా ముందుకెళ్తున్నారు.
తాజాగా `ఆకాశవాణి` ఫేం అశ్విన్ రంగరాజ్ తో రిషబ్ ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలొ స్తున్నాయి. అశ్విన్ గంగరాజు ఈ చిత్రాన్ని ఐదేళ్ల క్రితం చేసాడు. ఆ తర్వాత అతడి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అతడు ట్యాలెంటెడ్ అని విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. కానీ అతడి ప్రతిభను చాలా మంది హీరోలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తాజాగా రిషబ్ రూపంలో గొప్ప అవకాశం గంగరాజుకు దక్కుతుంది. ఇద్దరు చేతులు కలిపారంటే పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లే కనిపిస్తుంది.
