Begin typing your search above and press return to search.

రిషభ్ మ్యాసివ్ లైనప్.. ఒక్కో సినిమా ఒక్కో డైమండు!

కాంతారా సినిమాతో నేషనల్ అవార్డ్ సాధించిన కన్నడ స్టార్ రిషభ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్ట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

By:  Tupaki Desk   |   14 July 2025 12:42 PM IST
రిషభ్ మ్యాసివ్ లైనప్.. ఒక్కో సినిమా ఒక్కో డైమండు!
X

కాంతారా సినిమాతో నేషనల్ అవార్డ్ సాధించిన కన్నడ స్టార్ రిషభ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్ట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఇప్పటికే పలు సినిమాలు లాక్ చేశారు. ఈ సినిమాలన్నీ సాంస్కృతిక, చారిత్రక ఇతిహాసాలు, పౌరాణికం జానర్ లో రానుండడం విశేషం. ఈ సినిమాలతో రిషభ్ రానున్న ఐదేళ్లు ఫుల్ బిజీబీజీగా గడపనున్నారు. మరి ఆయన తదుపరి ప్రాజెక్ట్ లు ఏంటి? ఏయే డైరెక్టర్ తో పనిచేయనున్నారంటే?

2022లో రిషభ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు రిషభ్ ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ చేస్తున్నారు. ఇది కూడా ఆయనే తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం 2025 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా జై హనుమాన్. 2024లో హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రశాంత్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిషభ్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ కూడా విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవి రూపొందిస్తున్నారు.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రిషభ్ లీడ్ రోల్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రిషభ్ ది ప్రైడ్ ఆఫ్ భారత్ గా పిలుచుకునే శివాజీ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో శివాజీ నాయకత్వం, ఆయన వారసత్వం జానర్ లో తెరకెక్కుతుంది. ఇది పాన్ఇండియా లెవెల్ లో రూపొందుతుంది. ఈ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2027 జనవరిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

రిషభ్ చేతిలో ఉన్న మరో సినిమా '1770 మూవీ'. ఇది బంకింమ్ చంద్ర ఛటర్జీ నవల ఆనందమత్ ఆధారంగా ఈ కథ తెరకెక్కనుంది. దీనికి ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతుంది. వలసవాద వ్యతిరేక ఘటన, తిరుగుబాటు నేపథ్యంమే ఈ సినిమా కథ. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలోనూ రిషభ్ నటిస్తున్నారు. ఇది శ్రీ కృష్ణదేవరాయల బయోపిక్‌ ఆధారంగా తెరకెక్కుతోంది. గతంలో అశుతోష్ లగాన్, జోధా అక్బర్ వంటి పీరియాడికల్ డ్రామాలకు దర్శకత్వం వహించారు. విష్ణు వర్ధన్ ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది.

ఇలా హీరో రిషభ్ భారతదేశ ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కథలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రతీ సినిమా వేరే యుగం, అధ్యాత్మిక అంశాల ఆధారంగా తెరకెక్కనుండడంతో ఆయనకు భారత సంస్కృతిపై ఉన్న గౌరవం అర్థమవుతోంది. ప్రతి సినిమా దేశ చరిత్రను, సంస్కృతిని ప్రతిభింభిస్తున్నాయనడంలో సందేహం లేదు!