Begin typing your search above and press return to search.

కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డౌట్స్.. మళ్ళీ క్లారిటీ ఇచ్చిన మేకర్స్

"కాంతారా" సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రిషబ్ శెట్టి, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ "కాంతారా: చాప్టర్ 1"పై అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకర్షిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   22 May 2025 6:35 PM
కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డౌట్స్.. మళ్ళీ క్లారిటీ ఇచ్చిన మేకర్స్
X

"కాంతారా" సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రిషబ్ శెట్టి, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ "కాంతారా: చాప్టర్ 1"పై అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకర్షిస్తున్నాడు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అద్భుత ప్రతిభను కనబరిచిన రిషబ్, కేవలం కన్నడకే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సంపాదించారు. మొదటి పార్ట్‌లోని అతని పెర్ఫార్మెన్స్, అజనీష్ లోకనాథ్ సంగీతం, జానపద అంశాల కథనం సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. దీంతో ఇప్పుడు చాప్టర్ 1 అంటేనే అంచనాలు రెట్టింపు అయ్యాయి.

"కాంతారా: చాప్టర్ 1" ఇప్పటికే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న విషయం తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కర్ణాటకలోని అడవుల్లో ప్రామాణిక సెటప్‌తో భారీ స్థాయిలో షూటింగ్ జరుగుతోంది. ఇది ప్రీక్వెల్ కావడం వల్ల కథాభాగం మరింత మిస్టరీగా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. అందులోను రిషబ్ మరోసారి నటనతో సరికొత్తగా ఆకట్టుకొనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల కొంతమంది యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా పేజ్‌లు "కాంతారా: చాప్టర్ 1" రిలీజ్ వాయిదా పడిందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్‌లో గందరగోళం మొదలైంది. అయితే తాజాగా హోంబలే ఫిలింస్ క్లారిటీ ఇచ్చింది. వారి ప్రకటన ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ పూర్తిగా ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతోంది. షూటింగ్‌లో ఎలాంటి ఆటంకాలు లేవు. అన్ని పనులు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని చెప్పేశారు.

అలాగే "కాంతారా: చాప్టర్ 1" సినిమా ఇదే ఏడాది అక్టోబర్ 2 విడుదల కానుంది. ఈ తేదీ మారలేదని స్పష్టం చేశారు. అఫీషియల్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ లేవు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటామని తెలిపారు. దీంతో సినిమా వాయిదా పడిందని వస్తున్న రూమర్లన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది.

ఇదిలా ఉంటే, "కాంతారా: చాప్టర్ 1" పట్ల ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి విపరీతంగా ఉంది. మళ్ళీ రిషబ్ తన ప్రత్యేకమైన కథా దృక్పథంతో ఎంతగా మెప్పిస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. పైగా ఈసారి తాను చూపించే మిస్టిక్ ప్రపంచం, డెవైన్ కానెక్షన్ మరింత డార్క్, ఎమోషనల్‌గా ఉండబోతుందన్న టాక్ హైప్‌ను పెంచుతోంది. చూడాలి మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో.