కాంతార చాప్టర్ 1 ట్రైలర్: మరో ప్రపంచంలో ఈశ్వర రూపం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార సినిమా 400 కోట్లతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 22 Sept 2025 1:19 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార సినిమా 400 కోట్లతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అదే కథను కొనసాగిస్తూ రిషబ్ శెట్టి కాంతార ప్రపంచాన్ని మరింత లోతుగా కొత్త రహస్యాలను చూపించబోతున్నట్టుకు అర్ధమవుతుంది. కాంతార చాప్టర్ 1గా రానున్న కొత్త సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
మొదటి భాగం ఊహించని విజయం సాధించడంతో ఈసారి ఏ రేంజ్‌లో చూపిస్తాడోనని అభిమానులందరూ వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలకు రెట్టింపు క్రేజ్ తెచ్చిపెట్టింది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు మరో కొత్త ప్రపంచాన్ని హైలెట్ చేసింది. “నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు?” అనే ప్రశ్నతో మొదలై, ప్రతి షాట్ కూడా ఎమోషన్‌తో ఉండేలా జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా నేటివిటీ టచ్‌తోపాటు ఎమోషనల్ లేయర్స్ యాడ్ చేయడం వలన విజువల్స్ మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక అజినిష్ సాలిడ్ బిజీఎమ్ కూడా బాగానే హైలెట్ అయ్యింది. రిషబ్ శెట్టి లుక్, ప్రెజెన్స్ ఈసారి కూడా హైలైట్ అయ్యాయి. లోకల్ కల్చర్, దేవుడిపై నమ్మకం, సామాజిక అన్యాయం, తిరుగుబాటు అన్నీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూపించారు.
చివర్లో ఈశ్వరుడు ఉన్నాడు అంటూ చూపించిన షాట్ మాత్రం వైబ్ క్రియేట్ చేసేలా ఉంది. గతంలో కాంతారలో సాదాసీదా కథకు దైవికతను జోడించి వేరే స్థాయిలోకి తీసుకెళ్లిన రిషబ్ ఈసారి మరింత లోతుగా వెళ్ళాడని అనిపిస్తోంది. ప్రొడక్షన్ విల్యూస్ ఈ ట్రైలర్‌కి మరో లేయర్ జోడించాయి. హంబలే ఫిలింస్ ఖర్చుకు వెనకాడలేదని ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా విజువల్స్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ఆర్ట్, కెమెరా వర్క్, లైటింగ్ అన్నీ కలిపి ఒక పెద్ద కాన్వాస్‌ను ఆవిష్కరించాయి.
తెలుగులో ఈ సినిమాను గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండగా, నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టారు. సౌత్ మార్కెట్‌తో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సునామీలా దూసుకెళ్తుందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ ద్వారా సినిమాను గట్టిగానే హైలెట్ చేశారు. ఇక సినిమా కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి అక్టోబర్ 2న వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
