Begin typing your search above and press return to search.

ఇల్లు మ‌డ‌త‌పెట్టి అంబానీ పెళ్లికి తెచ్చుకుంది!

ఆ సమయంలో ఒక అభిమాని దీనిపై సెటైర్ వేసాడు. ఈ వీడియోలో అత‌డు ''ఆమె తనతో ఏమి తీసుకువస్తోంది? ఒక మడత పెట్టిన ఇల్లు?'' అని కామెంట్ చేసాడు.

By:  Tupaki Desk   |   1 March 2024 11:51 AM GMT
ఇల్లు మ‌డ‌త‌పెట్టి అంబానీ పెళ్లికి తెచ్చుకుంది!
X

అంబానీల ఇంట పెళ్లి సంబ‌రం అంబ‌రాన్నంటుతోంది. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ జంట వివాహం ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ పెళ్లి గురించి అంబానీల ఖ‌ర్చు, సెల‌బ్రిటీల జాబితా ఇదివ‌ర‌కే వైర‌ల్ అయ్యాయి. ఇప్ప‌టికే అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం అంత‌ర్జాతీయ‌ పాప్ స్టార్ రిహన్నా గుజరాత్‌లోని జామ్‌నగర్ వ‌ద్ద వెన్యూకు వచ్చారు. ఫిబ్రవరి 29న రిహన్నా ల‌గేజీని రైలు సామాను బండ్ల ద్వారా లాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఒక అభిమాని దీనిపై సెటైర్ వేసాడు. ఈ వీడియోలో అత‌డు ''ఆమె తనతో ఏమి తీసుకువస్తోంది? ఒక మడత పెట్టిన ఇల్లు?'' అని కామెంట్ చేసాడు.

ఈ వ్యాఖ్య రిహన్న దృష్టిని ఆకర్షించింది. ఆమె సరదాగా బదులిస్తూ ''స్టేజ్ నా క్యారీన్ (sic)లో సరిపోలేదు..'' అని వ్యాఖ్య‌ను జోడిస్తూ.. దానితో పాటు భుజం తట్టుకునే ఎమోజిని షేర్ చేసింది. అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వడానికి రిహన్నా భారతదేశానికి వచ్చారు. పెళ్లిలో డైమండ్స్-ఆల్ ఆఫ్ ది లైట్స్-వి ఫౌండ్ లవ్ ఇన్ ఎ హోప్‌లెస్ ప్లేస్ లాంటి పాట‌ల్ని రిహానా ఆల‌పించి పెర్ఫామ్ చేయ‌నుంద‌ని తెలిసింది.

ఈ మూడు పాటలే కాకుండా అనంత్ - రాధికల ప్రీ వెడ్డింగ్‌లో రిహన్నా వేర్ హావ్ యు బీన్, డోంట్ స్టాప్ ది మ్యూజిక్, ఓన్లీ గర్ల్ (ఇన్ ది వరల్డ్) వంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం వేదికపైకి రానుంది. ఆమె వచ్చిన తర్వాత రిహన్న రాత్రంతా వేదికపైనే ఉందని తెలిసింది. ఆమె పరివారంలో నేపథ్య గాయ‌కులు, నృత్యకారులు ఉన్నారు. ఆమె స్వయంగా ప్రదర్శించే ఇండోర్ అరేనాలో ఉంది. ఈ రాత్రికి రిహన్న లుక్ ఇండో-ఫ్యూజన్ వేర్ మిక్స్‌గా ఉంటుందని తెలిసింది.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. వేడుక‌ మార్చి 1న ప్రారంభం కానుంది. పాపుల‌ర్ గాయనీగాయ‌కులు జామ్‌నగర్‌కు చేరుకున్న‌ వీడియో ఇంత‌కుముందే ఆన్‌లైన్‌లో కనిపించింది. క్లిప్‌లో గాయని రిహానా త‌న‌ కార్ట్‌లో కూర్చుని విమానాశ్రయం వెలుపల వెళుతున్నట్లు క‌నిపించింది. ఇత‌ర పాపుల‌ర్ పాప్ గాయ‌కుల ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

ఈ ఫంక్షన్‌లో ప్రదర్శన ఇవ్వనున్న అనేక మంది ప్రముఖ కళాకారులలో రిహన్నా ఒకరు. బాలీవుడ్ నుంచి అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్ త‌దిత‌రులు సంగీత విద్వాంసుల శ్రేణిలో ఉన్నారు. వారు గ్రాండ్ ఈవెంట్‌లో తమ ప్రదర్శనలతో అతిథులను ఆకట్టుకుంటారు.