Begin typing your search above and press return to search.

ఈ అమ్మాయి గుర్తుందా.. వ్వాటే లుక్స్!

గ్రే కలర్ కోట్ లో మెరిసింది రిద్ధి కుమార్. తన అందాలను చూపిస్తూ సూట్ ను అలా ఎగరేస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. నాభి అందాలు ప్రదర్శిస్తూ నెట్టింట హీటెక్కించింది.

By:  Tupaki Desk   |   10 March 2024 4:39 AM GMT
ఈ అమ్మాయి గుర్తుందా.. వ్వాటే లుక్స్!
X

రిద్ధి కుమార్.. ఈ కేరళ కుట్టీ లవర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఈ మూవీలో తన నటనతో ఆకట్టుకుంది అమ్మడు. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రాధేశ్యామ్ మూవీలో తళుక్కున మెరిసింది. ఈ చిత్రంలో ఆర్చరీ ప్లేయర్ గా కనిపించిన రిద్ధి.. ఇప్పటి వరకు మళ్లీ టాలీవుడ్ లో సందడి చేయలేదు. ఆమె చేతిలో తెలుగు సినిమాలేవి లేవు.

బాలీవుడ్ లో పలు సిరీస్ లు, సినిమాల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె హిందీతోపాటు ఓ మలయాళం మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యాక్టింగ్ లో రిద్ధి తనదైన ప్రతిభ కనబరుస్తుంటుంది. ఏ పాత్ర అయినా చక్కగా ఒదిగిపోతుంది. తన నటనతో అదరగొడుతుంది. కానీ ఇప్పటి వరకు ఆమె తన టాలెంట్ చూపించేందుకు సరైన ఛాన్స్ దొరకలేదు.

అయితే గ్లామర్ పాత్రలకు రిద్ధి దూరంగా ఉండడం వల్ల ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదని సినీ పండితులు అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అలరిస్తుంటోంది రిద్ధి కుమార్. వరుస ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటోంది. అందాల విందుతో కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. తన స్కిన్ షోతో ఫాలోవర్స్ పెంచుకుంటోంది. తాజాగా కొత్త ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.

గ్రే కలర్ కోట్ లో మెరిసింది రిద్ధి కుమార్. తన అందాలను చూపిస్తూ సూట్ ను అలా ఎగరేస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. నాభి అందాలు ప్రదర్శిస్తూ నెట్టింట హీటెక్కించింది. తన గ్లామర్ షోతో సెగలు పుట్టిస్తోంది. క్రేజీగా ఇంగ్లీష్ లో క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రిద్ధి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టు మచ్ స్టన్నింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే మ‌హారాష్ట్ర‌లోని పుణెలో రిద్ది కుమార్‌ జన్మించింది. ఫిలాసఫీ లో డిగ్రీ పూర్తి చేసి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రిద్ధి కుమార్ కెరీర్ లో చెప్పుకోదగిన హిట్స్ లేకపోయినా వచ్చిన ఆఫర్లు అన్నీ తప్పకుండా వినియోగించుకుంటోంది ఈ అమ్మడు. మరి ఈ బ్యూటీ తన గ్లామర్ షోతో వరుస అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.