Begin typing your search above and press return to search.

కుమారుడిని కోల్పోయిన న‌టుడు

ఫేమ‌స్ పాన్ స్టార్స్ సృష్టిక‌ర్త‌..న‌టుడు రిక్ హారిస‌న్ ఎంతో ఫేమ‌స్ న‌టుడని చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 9:27 AM GMT
కుమారుడిని కోల్పోయిన న‌టుడు
X

ఫేమ‌స్ పాన్ స్టార్స్ సృష్టిక‌ర్త‌..న‌టుడు రిక్ హారిస‌న్ ఎంతో ఫేమ‌స్ న‌టుడని చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క టీవీషోతోనే విప‌రీత‌మైన ఫాలోయింగ్ సంపాదించిన న‌టుడు. అయితే ఇప్పుడ‌త‌ని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రిక్ హారిస‌న్ కుమారుడు ఆడ‌మ్ హారిస‌న్ 39 ఏళ్ల వ‌య‌సులో హ‌ఠాన్మ‌రణం చెందాడు. మాద‌క ద్ర‌వ్యాలు అధికంగా తీసుకోవ‌డంతోనే ఆడ‌మ్ మృతి చెందిన‌ట్లు తెలుస్తుంది. ఆడ‌మ్ మృతిపై పోలీసులు కేసు న‌మోదు చేస్తున్నారు.

ఈనేప‌థ్యంలో కుమారుడి మృతి ప‌ట్ల రిక్ హార‌సన్ ఓ బావేద్వ‌గ‌పూరిత పోస్ట్ చేసారు. కుమారిడితో కలిసి రెస్టారెంట్ లో క‌లిసి ఉన్న కొన్ని ఫోటోల్ని పోస్ట్ చేసి అత‌డి జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయాడు. `నువ్వు ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉంటావు. నేను నిన్ను నిరంత‌రం ప్రేమిస్తూనే ఉంటాను` అని రాసుకొచ్చి ముక్క‌లైన హృదయం ఎమోజీని పోస్ట్ చేసారు. పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధి లారా హెర్లోవిచ్ మాట్లాడుతూ..` డ్ర‌గ్స్ ఓవ‌ర్ డోస్ కార‌ణంగా మృతి చెందిన‌ట్లు చెబుతున్నారు. అందులో నిజం ఏమిటో తెలియాలి. దీన్ని అనుమానా ద‌స్ప‌ద మృతిగా భావిస్తున్నాం. ఆడమ్ మరణంతో మా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది` అని అన్నారు.

రిక్ హారిసన్ 2009 నుండి తన మొత్తం కుటుంబంతో హిస్టరీ ఛానెల్ ప్రోగ్రామ్ నిర్వ‌హిస్తున్నారు. ఇది కుటుంబ సంబంధాలు - లాస్ వెగాస్ బౌలేవార్డ్‌లోని స్టోర్ ఫ్రంట్ షాప్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్ పాన్ యొక్క రోజువారీ కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. ఇక ఆడమ్ హారిసన్ గతంలో గోల్డ్ అండ్ సిల్వర్ పాన్‌లో ఉన్న‌ప్ప‌టికీ `పాన్ స్టార్స్` కనిపించలేదు. ఈ కార్యక్రమంలో హారిసన్ పెద్ద కుమారుడు కోరీ హారిసన్ నటించారు. అతని చిన్న కుమారుడు జేక్ హారిసన్ కూడా ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆడ‌మ్ మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉన్నాడు.