Begin typing your search above and press return to search.

అప్పట్లో యూత్ ని మాయలో పడేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడిలా..!

ఒకప్పటి తమ క్రేజ్ వల్ల ఎప్పుడైనా వారి గురించి చూస్తే వారి ప్రస్తుత లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతారు.

By:  Tupaki Desk   |   9 April 2024 3:00 AM GMT
అప్పట్లో యూత్ ని మాయలో పడేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడిలా..!
X

ఒకప్పుడు యూత్ ఆడియన్స్ అంతా తమ బుట్టలో వేసుకున్న భామలంతా ఇప్పుడు తమ లుక్స్ తో అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. కొందరు హీరోయిన్స్ ఐదు పదుల వయసు వచ్చేదాకా తమ అందాన్ని కాపాడుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం గ్లామర్ ని పూర్తిగా వదిలేసి ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటారు. ఒకప్పటి తమ క్రేజ్ వల్ల ఎప్పుడైనా వారి గురించి చూస్తే వారి ప్రస్తుత లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతారు.

అలాంటి వారిలోనే ఒకప్పటి యువత మనసులు దోచిన రిచా పల్లోడ్ లేటెస్ట్ లుక్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సినిమాల్లో నటించిన రిచా ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మోడల్ గా క్రేజ్ తెచ్చుకున్న ఆమె టాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. రిచా హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా నువ్వే కావాలి. విజయ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించాడు. 2000 లో వచ్చిన ఈ సినిమా అప్పటి యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రేమకథలకు నువ్వే కావాలి ఒక బెంచ్ మార్క్ మూవీగా అనిపించుకుంది. సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ అవన్నీ ఇప్పటికీ స్పెషల్ గా అనిపిస్తాయి. నువ్వే కావాలి సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో రిచా క్రేజ్ తెచ్చుకున్నా ఆ తర్వాత స్టార్ డం కొనసాగించడంలో విఫలమైంది. నువ్వే కావాలి, చిరుజల్లు, ప్రేమతో రా, హోలి, నా మనసిస్తారా, పెళ్లాం పిచ్చోడు సినిమాల్లో నటించిన రిచా చివరగా 2016లో మలుపు సినిమాలో దర్శనమిచ్చింది.

తెలుగులో 8 సినిమాల దాకా చేసిన రిచా హిందీతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ ఇన్నాళ్లకు తన సోషల్ మీడియా ద్వారా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది రిచా పల్లోడ్. 2011 లో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రిచా 2020 లో యువర్ ఆనర్ అనే వెబ్ సీరీస్ లో నటించింది.

రిచా లేటెస్ట్ లుక్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. 40 నుంచి 50 మధ్యలో ఉన్న అమ్మడు తన లుక్స్ తో సర్ ప్రైజ్ చేసింది. హీరోయిన్ గా చేస్తున్నప్పుడు చాలా క్యూట్ గా అనిపించిన రిచా సినిమాలు చేయట్లేదు కాబట్టి లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నట్టు లేదు అందుకే అమ్మడు కాస్త ముదురు తనం కనిపిస్తుంది. నువ్వే కావాలి లో ఆమెను ఎంతో అందంగా చూసిన తెలుగు ఆడియన్స్ రిచా లేటెస్ట్ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి తారలంతా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో రిచా కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తుందా.. ఎలాగు హీరోయిన్ గా కష్టం కాబట్టి సపోర్టింగ్ రోల్స్ చేసే ఆలోచన తనకు ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.