Begin typing your search above and press return to search.

చాన్నాళ్ల‌కు లీడ‌ర్ భామ ఇలా కెమెరాకు చిక్కింది

త‌న భ‌ర్త‌, ఇత‌ర స్నేహితుల బృందంతో రిచా గంగోపాధ్యాయ్ స‌ముద్ర లొకేష‌న్ లో వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   11 March 2024 4:11 AM GMT
చాన్నాళ్ల‌కు లీడ‌ర్ భామ ఇలా కెమెరాకు చిక్కింది
X

టాలీవుడ్ లో రానా, నాగార్జున‌, అల్లు అర్జున్, ర‌వితేజ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది రిచా గంగోపాధ్యాయ్. లీడ‌ర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ మిర‌ప‌కాయ్, నాగ‌వ‌ల్లి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ఎంబీఏ చ‌దివేందుకు అమెరికా వెళ్లిపోయింది. అక్క‌డే క్లాస్ మేట్ లాంగెల్లాతో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. అత‌డిని పెళ్లాడాక‌ పూర్తిగా సినిమాల‌కు స్వ‌స్థి చెప్పేసింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి సెలబ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ సంసార జీవ‌నంలో స‌రిగ‌మ‌ల్ని ఆస్వాధిస్తోంది.

జో లాంగెల్లా మిలటరీ అధికారి అని కూడా రిచా ఇంత‌కుముందు వెల్ల‌డించింది. మ‌రోసారి భ‌ర్త లాంగెల్లాతో త‌న విహార యాత్ర‌కు సంబంధించిన ఫోటోషూట్ ని షేర్ చేసింది రిచా. త‌న భ‌ర్త‌, ఇత‌ర స్నేహితుల బృందంతో రిచా గంగోపాధ్యాయ్ స‌ముద్ర లొకేష‌న్ లో వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తోంది.

డొమినికన్ రిపబ్లిక్‌- స‌మానాలోని నా గ్లోబ‌ల్ గ్లింప్స్ టీమ్‌తో వారం రోజుల పాటు విహార‌యాత్ర‌లో నూతనోత్తేజాన్ని పొందుతున్నాను! మా సహోద్యోగులు శక్తివంతమైన సిబ్బంది ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్నారు. మేమంతా సంవత్సరానికి ఒకసారి క‌లుసుకున్న‌ప్పుడు అది స్వచ్ఛమైన మాయాజాలం. మేము నవ్వుకున్నాము.. ఆడుకున్నాము.. బంధాలను పటిష్టం చేసుకున్నాము. గత వారంలో ఒకరితో ఒకరు కలిసి పెరిగాము. అదే సమయంలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటైన సమానాలో విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అయ్యాం.. అని తెలిపింది.

సమనా బేకి ఎదురుగా ఉన్న పచ్చని అడవి, కొండలపై మేము మా తిరుగు ప్ర‌యాణానికి సరైన బ్యాక్‌డ్రాప్ అయిన haciendacocuyo వద్ద బస చేశాము. గ్రీన్ సెయిల్ స‌మానాతో మా బోట్ సాహసాలు అద్భుతం. తిమింగలాలకు ఎదురెదురుగా వెళ్లాం! మేము ఎండలో తిరిగాము.. కాయో లెవొంటాడో ద్వీపంలోని అందమైన నీలి జలాల్లోకి దూకి, నా స్నేహితులను పిలవడం నా అదృష్టంగా భావిస్తాను. తోటి సహోద్యోగులతో అందమైన క్షణాలను ఆస్వాధించాము. ఇటీవ‌లి గత వారం గురించి ఆలోచించడం నాలో కృతజ్ఞతా భావాన్ని నింపుతుంది. ప్రతిరోజూ నా జీవితానికి ఎంతో స్ఫూర్తిని వెలుగును తెచ్చే సృజనాత్మకత, ఆలోచనాత్మకమైన అద్భుతమైన మానవులతో కలిసి పని చేసే అవ‌కాశం ల‌భించింది. నా పుట్టినరోజు నెలలో ప్రవేశిస్తున్నాను.. ఇది నాకు అవసరమైన రీఛార్జ్! అని తెలిపింది. మార్చి 20న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులు ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రిచా తెలుగులో లీడర్- మిరపకాయ్-భాయ్ లాంటి చిత్రాల్లో న‌టించింది. ధనుష్ సరసన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేసిన `మయక్కం ఎన్నా` చివరి సినిమా. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం కెరీర్ ని విడిచిపెట్టేసిన ఈ భామ భ‌ర్త‌తో సంసార జీవ‌నాన్ని ఆస్వాధిస్తోంది. త‌న హ్యాపీ లైఫ్ గురించి రిచా ఎప్పుడూ ఏదీ దాచుకోకుండా ప్ర‌తిదీ బ‌హిరంగంగా వెల్ల‌డిస్తోంది. రిచా లాంగెల్లాకు ఒక బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.