Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ వెడ్డింగ్ భామ‌లు వ‌స్తున్నారండోయ్!

'వీర్ ది వెడ్డింగ్' కి సీక్వెల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో రియా క‌పూర్ ఈ ప్ర‌క‌ట‌న చేసారు. ప్ర‌స్తుతం సీక్వెల్ పైనే ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:00 AM GMT
మ‌ళ్లీ వెడ్డింగ్ భామ‌లు వ‌స్తున్నారండోయ్!
X

ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'వీర్ ది వెడ్డింగ్' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో చెప్పా ల్సిన ప‌నిలేదు. క‌రీనా క‌పూర్..సోన‌మ్ క‌పూర్..శిఖా త‌ల్సానియా...స్వ‌రా భాస్క‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో శ‌శాంక ఘోష్ తెర‌కెక్కించిన చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించింది. 28 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ 140 కొట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. రియా క‌పూర్..ఏక్తా క‌పూర్..నిఖిల్ ద్వివేది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించి మంచి లాభాలు చూసారు.

న‌టీన‌టులు..ద‌ర్శ‌కుడి పారితోషకం త‌ప్ప అంత‌కుమించి భారీ ఖ‌ర్చు ఎక్క‌డా క‌నిపించ‌దు. బ‌డ్జెట్ లెస్ సినిమా కావ‌డంతోనే ఇది సాద్య‌మైంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుంద‌ని బాలీవుడ్ మీడియాలో చాలాసార్లు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. కానీ వాటిపై ఏనాడు నిర్మాత‌లు స్పందించ‌లేదు. దీంతో సీక్వెల్ లేద‌ని అంతా ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. అయితే అంద‌రి అంచ‌నాలు త‌ల్లికిందులు చేస్తూ రియాక‌పూర్ ట్విస్ట్ ఇచ్చారు.

'వీర్ ది వెడ్డింగ్' కి సీక్వెల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో రియా క‌పూర్ ఈ ప్ర‌క‌ట‌న చేసారు. ప్ర‌స్తుతం సీక్వెల్ పైనే ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్పుడు రాబోయేచిత్రం చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సినిమా ఉంటుంద‌న్నారు. 'స్టోరీ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ సినిమా నాకు చాలా ముఖ్య‌మైన‌ది. మ‌ళ్లీ సోద‌రి సోన‌మ్ క‌పూర్ తో క‌లిసి ప‌నిచేస్తుంద‌న్నందుకు సంతోషంగా ఉంది. వ‌చ్చే ఏడాది సినిమా సెట్స్ కి వెళ్ల‌నుంది' అని అన్నారు.

మొత్తానికి 'వీర్ ది వెడ్డింగ్' అభిమానులకు ఇదొక స‌ర్ ప్రైజింగ్ న్యూస్. సీక్వెల్ ఉండ‌ద‌ని భావించిన నేప‌థ్యంలో స‌డెన్ గా ప్ర‌క‌టించ‌డం స‌ర్ ప్రైజ్ గా ఉందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే సీక్వెల్ లో మొద‌టి భాగంలో న‌టించిన సోన‌మ్ క‌పూర్ కన్ప‌మ్ అయింది. క‌రీనా కపూర్..స్వ‌రా భాస్క‌ర్ ఇత‌ర న‌టీన‌టులు భాగ‌మ‌వుతారా? కొత్త న‌టీన‌టుల‌తో ముందుకెళ్తారా? అన్న‌ది మాత్రం రియా క‌పూర్ రివీల్ చేయ‌లేదు.