Begin typing your search above and press return to search.

పొట్టి గౌన్‌ లో అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది

ఈ రేంజ్‌ లో ముందు ముందు అందాల ఆరబోత చేస్తే మళ్లీ బాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2023 3:30 AM GMT
పొట్టి గౌన్‌ లో అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది
X

ఎం టీవీ వీజే గా కెరీర్ ను ఆరంభించిన రియా చక్రవర్తి మెల్ల మెల్లగా నటిగా అడుగులు వేస్తున్న సమయంలో అనూహ్య పరిణామాల కారణంగా మొత్తం తలకిందులు అయింది. అయినా కూడా కెరీర్ లో నిలదొక్కుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. నటిగా తనను తాను మళ్లీ నిరూపించుకుని స్టార్‌ హీరోయిన్‌ గా నిలుస్తాను అనే నమ్మకంతో కనిపిస్తోంది.


2012 లో తూనీగ తూనీగ సినిమా తో మెప్పించిన ముద్దుగుమ్మ రియా చక్రవర్తి ఆ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకోవడం లో విఫలం అవ్వడంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ 2013 లో మేరె డాడ్‌ కి మారుతి సినిమా లో నటించి ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయింది. ముద్దుగుమ్మ రియా చక్రవర్తి కి అక్కడ తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు లభించింది.

హీరోయిన్‌ గా మంచి ఫామ్‌ లో ఉంది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం కేసు కారణంగా వార్తల్లో నిలిచింది. ఆ సమయం లోనే డ్రగ్స్ కేసు కారణంగా జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ప్రస్తుతం ఆ కేసులు ఎదుర్కొంటూనే మళ్లీ ఇండస్ట్రీ లో బిజీ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తోంది.

కేసుల వల్ల గతంలో వచ్చిన ఆఫర్లు చేజారి పోయాయి. మళ్లీ కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్లుగా ఇలాంటి డ్రెస్‌ ల్లో సందడి చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పొట్టి గౌనులో ఈ అమ్మడి అందాల ఆరబోతకు అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్‌ లో ముందు ముందు అందాల ఆరబోత చేస్తే మళ్లీ బాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కే అవకాశాలు ఉన్నాయి.

కొందరికి రియా చక్రవర్తి అంటే కోపం ఉన్నా కూడా ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ముందు ముందు ఆమె పై కోపం తగ్గి సినిమాల్లో నటిస్తే ఆధరించి అభిమానించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి ఫోటో షూట్స్ తో ఫిల్మ్‌ మేకర్స్ ను ఆకర్షిస్తే సినీ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది.