Begin typing your search above and press return to search.

హాలీవుడ్ ఇంటెలిజెన్స్ vs టాలీవుడ్ డంబ్‌నెస్: RGV సెటైరికల్ కామెంట్స్!

ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 May 2025 5:36 PM IST
హాలీవుడ్ ఇంటెలిజెన్స్ vs టాలీవుడ్ డంబ్‌నెస్: RGV సెటైరికల్ కామెంట్స్!
X

హాలీవుడ్, టాలీవుడ్ సినిమాల మధ్య ఉన్న తేడా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చలు నడుస్తుంటాయి. హాలీవుడ్ సినిమాలు ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌ను గౌరవిస్తూ, వారి ఆలోచనలను మరింత పెంచేలా సినిమాలు తీస్తాయని, అందుకే ‘మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ లాంటి సినిమాలు గ్లోబల్ హిట్స్ అవుతాయని చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా మే 17న భారత్‌లో విడుదలై, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకర్షించింది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. RGV తన సోషల్ మీడియా పోస్ట్‌లో హాలీవుడ్, టాలీవుడ్ సినిమాల మధ్య తేడాను సెటైరికల్‌గా వివరించాడు. హాలీవుడ్ ప్రేక్షకులను ఇంటెలిజెంట్‌గా భావించి, వారి ఇంటెలిజెన్స్‌ను మరింత పెంచేలా ‘మిషన్: ఇంపాసిబుల్ - ది ఫైనల్ రెకనింగ్’ లాంటి సినిమాలు తీస్తుందని అన్నారు.

అలాగే.. మనం ప్రేక్షకులను డంబ్‌గా భావించి, వారి డంబ్‌నెస్‌ను మరింత తగ్గించేలా, అత్యంత డంబ్ ప్రేక్షకులను కూడా చేరుకునేలా సినిమాలు తీస్తాం.. అని RGV కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఆలోచనలు రేకెత్తించే సినిమాల కొరతను, కమర్షియల్ ఫార్ములాపై ఎక్కువ ఆధారపడటాన్ని సూచిస్తున్నాయి. RGV వ్యాఖ్యలు నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారాయి.

కొందరు ఆయన మాటలను సమర్థిస్తూ, టాలీవుడ్‌లో ఇంటెలిజెంట్ కథలు, కొత్త ఆలోచనలతో సినిమాలు తీయడం తగ్గిందని అంటున్నారు. మన సినిమాలు ఎక్కువగా కమర్షియల్ ఫార్ములాతో, అదే హీరోయిజం, రొటీన్ లవ్ స్టోరీల చుట్టూ తిరుగుతాయి అని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇటీవల పలు సినిమాలు కొత్త కథలతో వచ్చి విజయం సాధించాయని, టాలీవుడ్‌లో కూడా మార్పు వస్తోందని మరికొందరు అంటున్నారు.

‘మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ సినిమా హాలీవుడ్ స్థాయిని చూపిస్తుందని, టామ్ క్రూజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే అందరినీ ఆకర్షించాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ కంటే వారం ముందు భారత్‌లో విడుదలై, అద్భుతమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ఆలోచనలను పెంచుతాయని, టాలీవుడ్ కూడా ఇలాంటి ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.