పెళ్లి విషయంలో గురుశిష్యులిద్దరు ఒకే మాట!
రాంగోపాల్ వర్మ-పూరి జగన్నాధ్ గురుశిష్యులు అన్న సంగతి తెలిసిందే. వర్మ ప్రియ శిష్యుడు ఎవరు అంటే పూరి పేరే చెబుతారు.
By: Tupaki Desk | 7 May 2025 2:00 PM ISTరాంగోపాల్ వర్మ-పూరి జగన్నాధ్ గురుశిష్యులు అన్న సంగతి తెలిసిందే. వర్మ ప్రియ శిష్యుడు ఎవరు అంటే పూరి పేరే చెబుతారు. వర్మకు చాలా మంది శిష్యలున్నా? పూరి మాత్రం వర్మకి ఎంతో ప్రత్యేకం. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. జీవిత ఫిలాసఫీలు కూడా ఒకేలా ఉంటాయి. ఇద్దరి మధ్య చాలా విషయాల్లో సారుప్యత కనిపిస్తుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా దాన్ని గమనించొచ్చు.
చాలా సందర్భాల్లో వాళ్ల మాటల్లో ఈ విషయం క్లియర్ గా అర్దవవుతుంది. అయితే ఇద్దరి వ్యక్తిగత జీవితాలు కూడా దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. రాంగోపాల్ వర్మ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వర్మకు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొంత కాలానికి విడిపోయారు. ఏకారణంగా విడిపోయారంటే? జీవితంలో తాను చెసిన అతి పెద్ద తప్పు ఏది అంటే పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు గా చెబుతాడు వర్మ.
అప్పుడు ఆవేశంలో చేసుకున్నాను తప్ప ఆలోచనతో చేసుకోలేదని.. పెళ్లి చేసుకోవడం ఎంత పెద్ద తప్పో కాలక్రమంలో అర్దమైందని చెప్పాడు. అందుకే యువతకు కూడా వర్మ పెళ్లి చేసుకోవద్దని చెబుతాడు. చేసుకున్నారా? జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుందని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చెబుతుంటాడు. ఈ విషయంలో వర్మ పెద్ద పోరాటమే చేస్తున్నాడు. సరిగ్గా ఇదే విధానంలో పూరి కనిపిస్తున్నాడు.
పూరి కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. అలా గని పూరి వర్మలా విడాకులు తీసుకోలేదు. ధాంపత్య జీవితంలో కొనసాగుతూనే యువతని పెళ్లి చేసుకో వద్దని చెబుతున్నాడు. పెళ్లి అనే ఆలోచననే వర్మ చాలా తప్పుగా చెబుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని ఇబ్బంది పెడితే ఇల్లు వదిలి పారిపో మంటున్నాడు. ఏమోషనల్ బ్లాక్ మెయిల్ చేయమంటున్నాడు. పెళ్లి చేసుకున్న వాడికంటే చేసుకోని వాడి లైఫ్ బాగుందన్నాడు. అందుకే పెళ్లొద్దని చెబుతున్నాడు. వీళ్లిద్దరి మాట వినని అభిమానులు లేకపోలేదు. వర్మ-పూరి అభిమానులు వాళ్ల ఫిలాసఫీలను అంతే అనుసరిస్తున్నారు.
