Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నాల వ‌ర్మ మ‌ళ్లీ దెయ్యాల మీద ప‌డ్డాడే!

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ డైరెక్ట‌ర్ గా స‌క్సెస్ అందుకుని చాలా కాల‌మైంది. ప్ర‌య‌త్నాలైతే చేస్తు న్నాడు గానీ ఫ‌లించ‌డం లేదు.

By:  Tupaki Desk   |   10 April 2025 12:45 PM IST
సంచ‌ల‌నాల వ‌ర్మ మ‌ళ్లీ దెయ్యాల మీద ప‌డ్డాడే!
X

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ డైరెక్ట‌ర్ గా స‌క్సెస్ అందుకుని చాలా కాల‌మైంది. ప్ర‌య‌త్నాలైతే చేస్తు న్నాడు గానీ ఫ‌లించ‌డం లేదు. వ‌ర్మ‌తో పాటు ఆయ‌న శిష్యులు కూడా సినిమాలు చేస్తున్నారు. వాళ్లైనా స‌క్సెస్ అవుతున్నారా? అంటే అదీ క‌నిపించ‌లేదు. కొంత కాలంగా స‌న్నివేశం ఇలాగే ఉంది. అలాగే వ‌ర్మ ఆ సినిమా తీస్తాను? ఈ సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌ట‌నలు కూడా అంతే వేగంగా చేస్తున్నాడు. కానీ అవి అక్క‌డికే ప‌రిమితం అవుతున్నాయి.

ప్ర‌క‌టించిన ప్రాజెక్ట్ లు కార్య‌రూపం దాల్చ‌డం లేదు. ఇటీవ‌లే మ‌ళ్లీ పాత వర్మ‌ని చూపిస్తాన‌ని ప్రామిస్ చేసాడు. కానీ అది ఇంకా జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌ర్మ మ‌రో కొత్త హార‌ర్ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. `పోలీస్ స్టేషన్ మే భూత్` కొత్త సినిమాతో వ‌చ్చారు. `మీరు చనిపోయిన వారిని చంపలేరు` అనేది ట్యాగ్‌లైన్. ఇందులో మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. స్టోరీకి సంబంధించి ఇంకా లోతును వ‌ర్మ పంచుకున్నారు.

`మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు పరిగెత్తుతాము. కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అన్న పాయింట్ మీద‌నే క‌థాంశం తిరుగుతుంది. ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత ఓ పోలీస్ స్టేషన్ దెయ్యాల స్టేషన్‌గా మారు తుంది. గ్యాంగ్‌స్టర్ల దయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులం దరూ భయంతో పరిగెత్తుతారన్నారు. దీన్ని వ‌ర్మ మార్క్ ఎగ్జిక్యూష‌న్ తో వెండితెర‌పై ఆవిష్క‌రిం చ‌నున్నారు.

ఈ సినిమాపై వ‌ర్మ చాలా కాన్పిడెంట్ గానూ క‌నిపిస్తున్నారు. ఇలాంటి హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ చిత్రాలు తెర‌కెక్కించ‌డంలో వ‌ర్మ స్పెష‌లిస్ట్. భూత్ (12 వ అంతస్థు), రాత్రి (రాత్రి), కౌన్ (ఎవరు), దెయ్యం, మర్రి చెట్టు లాంటి చాలా సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్టి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.