మణిరత్నం సినిమాలు నచ్చవంటున్న ఆర్జీవి.. రీజన్ ఇదే..!
అంతేకాదు మణిరత్నం సినిమాల్లో ది బెస్ట్ మూవీ అనిపించుకున్న నాయగన్ సినిమా కూడా తనకు నచ్చలేదని చెప్పారు వర్మ.
By: Tupaki Desk | 28 Jun 2025 9:09 AM ISTఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ చెప్పుకుంటున్నారు కానీ ఒకప్పుడు అలాంటి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మణిరత్నం. ఆయన చేసిన సినిమాలు ఎన్నో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించాయి. తెలుగులో కూడా మణిరత్నం కు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అంటే ఆయన సినిమాలు చూపించిన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐతే మణిరత్నం సినిమాలను చూసి ఆయన్ను స్పూర్తిగా తీసుకుని డైరెక్ట్ గా మారిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.
ఐతే మణిరత్నం సమకాలీకుడైన ఆర్జీవి మాత్రం తనకు అసలు ఆయన సినిమాలే నచ్చవని అన్నారు. కోలీవుడ్ లో ఎలాగైతే మణిరత్నం తన క్లాసిక్ సినిమాలతో అలరించారో.. తెలుగు పరిశ్రమ నుంచి ఆర్జీవి తన మార్క్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఐతే ఇద్దరి కథ కథనాలు సినిమా తెరకెక్కించే విధానాలు వేరుగా ఉంటాయి. ఐతే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆర్జీవి. వ్యక్తిగా మణిరత్నం ఇష్టమే కానీ డైరెక్టర్ గా ఆయన్ను ఇష్టపడను అని చెప్పారు ఆర్జీవి.
అంతేకాదు మణిరత్నం సినిమాల్లో ది బెస్ట్ మూవీ అనిపించుకున్న నాయగన్ సినిమా కూడా తనకు నచ్చలేదని చెప్పారు వర్మ. నాయగన్ సినిమాలో కమల్ హాసన్ నటన తనకు ఇష్టమే.. దానికి ఆయన పోషించిన వరద రాజన్ ముదలియార్ పాత్ర కావొచ్చని అన్నారు ఆర్జీవి. నాయగన్ మాత్రమే కాదు మణిరత్నం సినిమాలేవి తనకు నచ్చవని చెప్పి షాక్ ఇచ్చారు. ఐతే తన సినిమాలు నాకెలా నచ్చవో నా సినిమాలు కూడా మణిరత్నం కు నచ్చవని అన్నారు ఆర్జీవి.
ఐతే మణిరత్నం కాదు కానీ తమిళ పరిశ్రమ నుంచి తనను ఇన్ స్పైర్ చేసిన దర్శకుడు బాల చందర్ అని అన్నారు వర్మ. ఆయన సినిమా తీసే విధానం, స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ అన్నీ బాగుంటాయని ఆయన్ను స్పూర్తిగా తీసుకున్నట్టు ఆర్జీవి చెప్పారు. ఐతే మణిరత్నం వర్మ ఇద్దరు కలిసి పనిచేశారన్న విషయం ఎవరికీ తెలిసి ఉండదు. మణిరత్నం తీసిన దొంగా దొంగా సినిమాకు ఆర్జీవి రైటర్ గా వర్క్ చేశారు. ఇక వర్మ చేసిన గాయం సినిమాకు మణిరత్నం రచనా సహకారం అందించారు. అలా ఇద్దరు కలిసి పనిచేసినా కూడా ఎవరి స్టైల్ లో వారి సినిమాలు చేశామని చెప్పుకొచ్చారు ఆర్జీవి.
