Begin typing your search above and press return to search.

రివ్యూలపై అగ్ర హీరో పాజిటివ్ రియాక్షన్

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన కన్నూరు స్క్వాడ్స్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:42 AM GMT
రివ్యూలపై అగ్ర హీరో పాజిటివ్ రియాక్షన్
X

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన కన్నూరు స్క్వాడ్స్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఒటీటీలోకి కూడా వచ్చేసిన ఈ మూవీ ఆడియన్స్ ని భాగా ఎట్రాక్ట్ చేస్తోంది. యాక్షన్ అండ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ అందరిని మెప్పించే విధంగా ఉంది. మమ్ముట్టి తనదైన పెర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టారు. అలాగే బలమైన కథ, కథనం కూడా ఈ మూవీ సక్సెస్ కి ఒక కారణం అని చెప్పాలి.

ఇదిలా ఉంటే మమ్ముట్టి, జ్యోతిక కాంబినేషన్ లో తెరకెక్కిన రివ్యూ కాదల్ ద కోర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న మమ్ముట్టికి రివ్యూల ఇష్యూ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. గత కొంతకాలంలో కేరళలో సినిమా రివ్యూలపై వివాదం నడుస్తోంది. హైకోర్టు వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. కానూరు స్క్వాడ్స్ మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. దీంతో రివ్యూ బాంబింగ్ పై మీ అభిప్రాయం ఏంటి అని మమ్ముట్టిని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనిపై ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ని రివ్యూలు ఎప్పటికి డిసైడ్ చేయలేవని అన్నారు. రివ్యూలు సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తాయని నేను అనుకోవడం లేదని అన్నారు. అలాగే ఒక సినిమా చూసిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేసే హక్కు ఉంటుందని అన్నారు. అభిప్రాయాన్ని తెలియజేసే రైట్స్ ని కంట్రోల్ చేయలేమని, చేయకూడదు కూడా అని అన్నారు. అయితే ఎవరి ప్రభావానికి లోనుకాకుండా స్వేచ్చగా అభిప్రాయలని నిర్మాణాత్మక కోణంలో చెప్పాలని అన్నారు.

కన్నూరు స్క్వాడ్స్ సినిమాకి రివ్యూలు చాలా ప్లస్ అయ్యాయనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా ప్రమోషన్స్ లో ఈ మూవీ భాగంగా మమ్ముట్టి రివ్యూ బాంబింగ్ పై తన క్లారిటీ ఇచ్చారు. చాలా మంది స్టార్ హీరోలు రివ్యూలపై పెద్దగా రియాక్ట్ కారు. అయితే చిన్న సినిమాలు చేసే వారు మాత్రం వీటి విషయంలో కాస్తా ఎక్కువగానే స్పందిస్తున్నారనే మాట వినిపిస్తోంది.

మమ్ముట్టి రివ్యూలపై చేసిన కామెంట్స్ పై మలయాళీ ఇండస్ట్రీలో ఇతర సెలబ్రిటీలు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది తెలియాలంటే వేచి చూడాలి.