Begin typing your search above and press return to search.

క్లాసిక్ హిట్ వెనుక సీక్రెట్ రివీల్

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ ఆ సినిమా సంగ‌తులు గుర్తు చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 2:30 PM GMT
క్లాసిక్ హిట్ వెనుక సీక్రెట్ రివీల్
X

బాలీవుడ్ క్లాసిక్ హిట్స్ లో 'కుచ్ కుచ్ హోతా హై' ఒక‌టి. అప్ప‌ట్లో ఈ సినిమా ఓ సంచ‌ల‌నం. షారుక్ ఖాన్..కాజోల్ ..రాణీముఖ‌ర్జీల కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం. ద‌ర్శ‌క‌-నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్ నుంచి జాలువారిన ఓ గొప్ప క‌ళాఖండమిది. అయితే ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించారు. అమ‌న్ మెహ్రా అనే అతిది పాత్ర‌లో స‌ల్మాన్ మెరిసారు. ఇంకా సినిమాలో ప్ర‌తీ పాత్ర ఆద్యంతం ర‌క్తి క‌ట్టిప‌డేస్తుంది.


జ‌తిన్-లిలిత్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. అప్ప‌ట్లో 1.7 బిలియ‌న్స్ కి పై గా వ‌సూళ్ల‌ని సాధించింది. ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్-య‌శ్ రాజ్ ఫిలింస్ లో ఎంతో గొప్ప చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమా విడుద‌లై 25 వ‌సంతాలు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ ఆ సినిమా సంగ‌తులు గుర్తు చేసుకున్నారు. ప్ర‌త్యేకంగా స‌ల్మాన్ ఖాన్ పాత్ర గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు రివీల్ చేసారు. ఆవేంటే ఆయ‌న మాట‌ల్లోనే..

'అమ‌న్ పాత్ర కోసం అప్ప‌ట్లో చాలా మంది న‌టుల్ని ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నించా. తెలిసిన ప్ర‌తీ స్టార్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి అడిగాను. ఈ పాత్ర మీరు పోషించండి. ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొస్తుంద‌ని చెప్పేవాడిని. కానీ ఎవ‌రూ న‌న్ను న‌మ్మ‌లేదు. నా పాత్ర‌ని న‌మ్మ‌లేదు. ఆ స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్ ని క‌ల‌సి పాత్ర గురించి చెప్పాను. ఆ పాత్ర గురించి చెప్పాగానే కాదు..లేదు అనకుండా వెంట‌నే త‌ప్ప‌కుండా న‌టిస్తాను అన్నారు.

ఎందుకున‌టిస్తానో కూడా చెప్పారు. బాగా ఆత్మ విశ్వాసం ఉన్న న‌టుడే ఇలాంటి పాత్ర చేయ‌గ‌ల‌డు. దాన్ని నేను చేస్తున్నా' అన్నారు. ఆ మాట‌తో ఆ పాత్ర‌ని ఆయ‌న ఎంత‌గా ఓన్ చేసుకున్నారో అర్ధ‌మైంది. ఒక పాత్ర‌ని ఎంత‌గా ప్రేమించాలో స‌ల్మాన్ ఖాన్ కి బాగా తెలుసు. ద‌ర్శ‌కుల విజ‌న్ ని ప‌క్కాగా ప‌ట్టుకోగ‌ల న‌టుడు. ఆ రోజు అమ‌న్ పాత్ర‌ని నాకంటే గొప్ప‌గా అర్ధం చేసుకున్న వ్య‌క్తిగా స‌ల్మాన్ క‌నిపించారు'అని అన్నారు.