హాలీవుడ్ ను కూడా ఈ గడ్డపై ఎందుకు తీసుకు రాకూడదు!
14 ఏళ్ల క్రితం ఆగిపోయిన తెలుగు సినీ వేడుకని తిరిగి ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సినీ కళాకారులకు ప్రభుత్వం తరపున అవార్డులను అందించడం ఆనవాయితీగా వస్తుంది.
By: Tupaki Desk | 15 Jun 2025 9:47 AM IST14 ఏళ్ల క్రితం ఆగిపోయిన తెలుగు సినీ వేడుకని తిరిగి ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సినీ కళాకారులకు ప్రభుత్వం తరపున అవార్డులను అందించడం ఆనవాయితీగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రతి ఏటా ప్రభుత్వం తరపు నుంచి నంది అవార్డులను ఇచ్చే వారు. ఐతే ఏపీ తెలంగాణ వేరుగా ఏర్పడ్డాక 14 ఏళ్లుగా ఈ అవార్డులను ఇవ్వలేదు. ఫైనల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టి.జి.ఎఫ్.ఏ అవార్డ్స్ గా ప్రభుత్వం నుంచి సినీ కళాకారులకు అవార్డులను అందించారు.
హైదరాబాద్ హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినీ పరిశ్రమ మీద రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా అది పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహానికి మాత్రమే అందరికీ సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవార్డులు గెలిచిన వారందరికీ సీఎం రేవన్ రెడ్డి అవార్డులు అందించారు.
సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అవార్డులను ఇవ్వాలని దిల్ రాజు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేసిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేష్ లో నంది అవార్డులను ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు గుర్తింపు ఇచ్చేలా 1969 లో నంది అవార్డులను తీసుకొచ్చారు. ఏపీ సీఎంగా ఎవరు ఉన్నా ప్రతి ఏటా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని అన్నారు రేవంత్ రెడ్డి.
నంది అవార్డుల్లో తొలిసారి బెస్ట్ యాక్టర్ గా అక్కినేని నాగేశ్వర రావు అవార్డు అందుకున్నారు. అలాంటి గొప్ప కళాకారుడికి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని గుర్తుచేసుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి. కొన్ని కారణాల వల్ల 14 ఏళ్ల కిందట అవార్డులు ఇవ్వడం ఆగిపోగా మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో నంది స్థానంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తో వచ్చామని అన్నారు రేవంత్ రెడ్డి.
స్పీచ్ లో భాగంగా భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అనేవాళ్లు.. తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని చెప్పేవారు. కానీ ఇప్పుడు భారతీయ సినిమా అంటే తెలుగు ఇండస్టీ అని.. అందుకు హైదరాబాద్ వేదిక అని నిరూపించినందుకు ప్రభుత్వం తరపున అభినందిసున్నా అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమ మొదటి తరం ఎన్టీఆర్, ఏయన్నార్.. రెండో తరం కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. మూడోతరం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున.. ఇక్కడ నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉంది. వీరిలో పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ చాలా మంది ఉన్నారు. తనకు విద్యార్థిదశలో తెలిసిన వాళ్లు కూడా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. బన్ని, వెంకట్, అశ్వనీదత్ అమ్మాయిలు, నాగ్ అశ్విన్ ఇలా చాలా మంది తనకు తెలుసని అన్నారు. వాళ్లంతా బాగా రాణించడం సంతోషంగా ఉందని అన్నారు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉందని అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటు అందిస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుతం నడిపే టైం లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది ప్రోత్సహించడానికే అభినందించడానికే అని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 తో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తైన సందర్భంగా అభివృద్ధి చెప్దిన దేశాల సరసన మనం ఉండాలి. అన్ని రంగాల లానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించాలని ప్రభుత్వం ఆలోచన. ప్రపంచం గుర్తించే విధనంగా రాజమౌళి లాంటి దర్శకులు సినిమాలు తీస్తున్నారు. హాలీవుడ్ ను కూడా ఈ గడ్డపై ఎందుకు తీసుకు రాకూడదని అన్నారు. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందిస్తాం. 2047 విజన్ డాక్యుమెంటరీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.
