Begin typing your search above and press return to search.

ఆ బ్లాక్ బ‌స్ట‌ర్లు మ‌ళ్లీ కొట్టేయ‌డం ఖాయ‌మే!

కొన్ని నెల‌లుగా టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అనూహ్యంగా ఒకరికి వ‌చ్చిన ఐడియాని మిగ‌తా వారు కూడా ఆచ‌ర‌ణ‌లో కి తేవ‌డంతో రీ-రిలీజ్ లు జోరు అంత‌కంత‌కు రెట్టింపు అయింది.

By:  Tupaki Desk   |   8 March 2024 7:45 AM GMT
ఆ బ్లాక్ బ‌స్ట‌ర్లు మ‌ళ్లీ కొట్టేయ‌డం ఖాయ‌మే!
X

కొన్ని నెల‌లుగా టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అనూహ్యంగా ఒకరికి వ‌చ్చిన ఐడియాని మిగ‌తా వారు కూడా ఆచ‌ర‌ణ‌లో కి తేవ‌డంతో రీ-రిలీజ్ లు జోరు అంత‌కంత‌కు రెట్టింపు అయింది. తొలుత మాస్ యాక్ష‌న్ చిత్రాలు ఎక్కువ‌గా రిలీజ్ చేయ‌గా అటుపై వాటితో పాటు క్లాసిక్ ల‌వ్ స్టోరీల‌ను ఈ మ‌ధ్య కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఇట‌వ‌ల రిలీజ్ అయిన 'త్రీ.'.'సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్'..'ఖుషీ'..'ఆరెంజ్' ..'ఓయ్ 'లాంటి సినిమాలు రీ-రిలీజ్ లో మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

'ఆరెంజ్'..'ఓయ్' సినిమాలు రిలీజ్ లో పెద్ద‌గా రాణించ‌న‌ప్ప‌టికీ రీ-రిలీజ్ లో మాత్రం ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఆరెంజ్ అడ్వాన్స్ మూవీ కావ‌డంతో అప్ప‌ట్లో క‌నెక్ట్ కాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ చిత్రా నికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. ఆ స‌క్సెస్ ని చూసి మ‌రిన్ని ల‌వ్ స్టోరీలు రీ-రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఉయ‌ద్ కిర‌ణ్ కెరీర్ లో క‌ల్ట్ హిట్ గా గా నిలిచిన 'నువ్వు నేను 'మ‌ళ్లీ రిలీజ్ అవుతుంది.

అప్ప‌ట్లో ఈ సినిమా ఓట్రెండ్ సెట్ట‌ర్ లా నిలిచింది. న‌టుడిగా ఉద‌య్ కిర‌ణ్ ని స్టార్ హీరో చేయ‌డంలో ఈస‌క్సెస్ కీల‌క పాత్ర పోషించింది. ఈ విజ‌యంతో ఉద‌య్ కిర‌ణ్ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. చిత్రం త‌ర్వాత యువ‌త‌లో ఫాలోయింగ్ పెంచిన చిత్ర‌మిదే. అలాగే శంక‌ర్ డైరెక్ట్ చేసిన మ‌రో ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ ప్రేమికుడు కూడా రీ-రిలీజ్ అవుతుంది. ప్ర‌భుదేవా ..న‌గ్మ‌న‌టించిన ఈ సినిమా అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

ఈ సినిమా రీ-రిలీజ్ చేయాల‌ని శంక‌ర్ అభిమానులు కోర‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. అలాగే త‌రుణ్ హీరోగా న‌టించిన 'నువ్వే కావాలి' కూడా రీ-రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నితిన్ కెరీర్ లో మ‌రో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల‌న్నీ 4కె ఫార్మెట్ లో రీ-రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.