Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ ల వరద.. మళ్ళీ ఎక్కువైంది

కొద్ది రోజులు ఈ ట్రెండ్ కి గ్యాప్ ఇచ్చి మరల కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 4:28 AM GMT
రీ రిలీజ్ ల వరద.. మళ్ళీ ఎక్కువైంది
X

టాలీవుడ్ లో పోకిరి సినిమాతో రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. పాత సూపర్ హిట్ సినిమాలు అన్ని కూడా డిజిటల్ వెర్షన్ చేసి థియేటర్స్ లో మళ్ళీ రీరిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ఆరంభంలో స్టార్ హీరోల చిత్రాలకి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఒకటి, రెండు రోజులు కావడం, తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం వలన ఫ్యాన్స్ ఉత్సాహంగా సినిమాలు చూసేవారు.

అందుకే ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన వాటిలో ఖుషి మూవీ అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. అలాగే రామ్ చరణ్ ఫ్లాప్ మూవీ ఆరెంజ్ కూడా మంచి వసూళ్ళని రాబట్టింది. తరువాత స్టార్స్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాలని రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వీటికి ఆదరణ క్రమంగా తగ్గింది. ఫ్యాన్స్ వరకు, అది కూడా ఒక రోజు మాత్రమే థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు.

కొద్ది రోజులు ఈ ట్రెండ్ కి గ్యాప్ ఇచ్చి మరల కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫిబ్రవరి 7న ఈ మూవీ రీరిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర 2 మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. దీనికి పోటీగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రచారం నడిచింది.

పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే దాంతో పాటు మరికొన్ని హిట్ సినిమాలు వరుసగా రీరిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నట్టికుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి ఆఖరులో భరత్ అనే నేను సినిమా రీరిలీజ్ అవ్వనుందని చెప్పారు. అలాగే రామ్ చరణ్ నాయక్ మూవీ, రవితేజ దుబాయ్ శీను సినిమాలని నెక్స్ట్ రెండు నెలల్లో రీరిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

యాత్ర2కి పోటీగా వస్తోంది కాబట్టి కెమెరామెన్ గంగతో రాబాబు చిత్రానికి జనసైనికులు, పవర్ స్టార్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమాని బలంగా జనాల్లోకి వెళ్లేలా ఇప్పటికే ప్రమోషన్ మొదలుపెట్టారు. అయితే మిగిలిన సినిమాలకి ఏ మేరకు ఆదరణ వస్తుందనేది ఇప్పుడే చెప్పలేమని సినీ విశ్లేషకులు అంటున్నారు.