Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డే.. ఎలాంటి సినిమాలు రాబోతున్నాయంటే..

అయితే జనవరి 25, 26 తేదీలలో కొన్ని ఇంటరెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంది.

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:11 AM GMT
రిపబ్లిక్ డే.. ఎలాంటి సినిమాలు రాబోతున్నాయంటే..
X

సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. అయితే సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన సినిమాలలో విన్నర్ గా హనుమాన్ మూవీ నిలిచింది. ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ నెల ఆఖరు వారు హనుమాన్ సినిమా జోరు చూపించే అవకాశం ఉంది. అయితే జనవరి 25, 26 తేదీలలో కొన్ని ఇంటరెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంది.

వాటిలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకునే కాంబినేషన్ లో తెరకెక్కిన ఫైటర్ మూవీ జనవరి 25న హిందీతో పాటు ఇతర భాషలలో కూడా రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవ్వొచ్చు. అదే రోజు ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి కోలీవుడ్ లో మంచి ఆదరణ లభించింది.

సంక్రాంతి రేసులో ఉన్న తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ దొరకకపోవడం వలన జనవరి 25న తెలుగులో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. అలాగే శివ కార్తికేయన్ అయలన్ మూవీ జనవరి 26న తెలుగు వెర్షన్ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా ఏలియన్స్ ఎలిమెంట్ తో కమర్షియల్, యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి తమిళనాట మంచి వసూళ్లు రాబడుతోంది.

తెలుగులో కూడా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అలాగే మలయాళీ మూవీమలైకొట్టై వాలీబన్ జనవరి 25న రిలీజ్ కాబోతోంది. హాన్సికా మోత్వానీ సింగిల్ పాత్రతో రాజ్ దుస్స దర్శకత్వంలో ప్రయోగాత్మక హర్రర్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్ జనవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ కాస్తా ఇంటరెస్ట్ క్రియేట్ చేయడంతో ప్రేక్షకులకి ఎంత వరకు నచ్చుతుందనేది చూడాలి.

గత ఏడాది రిపబ్లిక్ డే టైంలో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే వెయ్యి కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ ఛాన్స్ హృతిక్ రోషన్ ఫైటర్ కి వచ్చింది. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి.