Begin typing your search above and press return to search.

అకిరా ఎంట్రీ.. మరోసారి రేణు దేశాయ్ పవర్ఫుల్ ఆన్సర్

టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ అకిరా నందన్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే కోరిక లేదని క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 9:57 AM GMT
అకిరా ఎంట్రీ.. మరోసారి రేణు దేశాయ్ పవర్ఫుల్ ఆన్సర్
X

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ తనయుడు అకిరా నందన్ మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టీనేజ్ లోకి రావడంతో త్వరలో అతను కూడా డెబ్యూ ఇస్తాడని భావిస్తున్నారు. అయితే అకిరా నందన్ ని హీరోగా చూడాలని అనుకుంటున్న పవర్ స్టార్ అభిమానులకి మాత్రం నిరాశ తప్పేలా లేదు.

అకిరా నందన్ ప్రస్తుతం సినిమాకి సంబందించిన వర్క్ నేర్చుకునే పనిలోనే ఉన్నారు. అయితే అతని ఫోకస్ అంతా మ్యూజిక్ మీద ఉన్నట్లుగా తాజాగా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ అకిరా నందన్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే కోరిక లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీలోనే అకిరా నందన్ ఉంటాడని మాత్రం స్పష్టం చేశారు.

ప్రస్తుతం మ్యూజిక్ కి సంబందించిన ట్రైనింగ్ తీసుకుంటున్నారని అన్నారు. అలాగే కథలు కూడా రాస్తున్నాడని. అకిరా కెరియర్ విషయంలో పవన్ కళ్యాణ్, తన నియంత్రణ ఏమీ లేదని, తాను ఎలా వెళ్లాలని అనుకుంటే అదే దారిలో వెళ్తాడని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. అతను ఏ దారిలో వెళ్ళిన తల్లిదండ్రులుగా మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని కూడా రేణు దేశాయ్ స్పష్టం చేశారు.

దీనిని బట్టి అకిరా నందన్ ని హీరోగా చూడాలని అనుకుంటున్న పవర్ స్టార్ అభిమానుల కల నెరవేరే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే అకిరా మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక షార్ట్ ఫిలిం చేశారు. రైటర్ బ్లాక్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం మ్యూజిక్ భాగానే కనెక్ట్ అయ్యింది. అయితే పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ గా మ్యూజిక్ నేర్చుకోవడం ద్వారా అయితే మ్యూజిక్ డైరెక్టర్, లేదంటే డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

మరి మెగా ఫ్యామిలీలో సెకండ్ జెనరేషన్ అందరూ హీరోలుగా సుమారు సెటిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఇమేజ్ అయితే వెంటనే వచ్చేస్తుంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్, బ్రాండ్ ఉంటుంది కాబట్టి వేగంగా నిలబడే ఛాన్స్ ఉంది. అతని హైట్, లుక్ కూడా ఎట్రాక్టివ్ గా ఉన్నాయి. మరి అతని కెరియర్ రూట్ ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి.