Begin typing your search above and press return to search.

రేణు దేశాయ్‌ మంచి నిర్ణయం.. కంటిన్యూ అయ్యేనా?

కానీ మంచి ఆఫర్‌ లు వస్తే వరుస సినిమాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా ఆమె సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 1:30 PM GMT
రేణు దేశాయ్‌ మంచి నిర్ణయం.. కంటిన్యూ అయ్యేనా?
X

సినిమాల్లో నటించక చాలా సంవత్సరాలు అయినా కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అవ్వడం వల్ల రెగ్యులర్ గా రేణు దేశాయ్‌ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఆమె మరాఠీ లో ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా ఇక్కడ అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే బుల్లి తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చిన రేణు దేశాయ్‌ తెలుగు సినిమా ల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.

రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో అత్యంత కీలకమైన హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్‌ కనిపించారు. రన్‌ టైమ్‌ తో పట్టింపు లేకుండా కథ లో అత్యంత కీలకం మరియు పవర్ ఫుల్‌ పాత్ర ను ఆమె ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ విషయం లో ఆమెను చాలా మంది అభినందించారు.

ఇప్పుడు రేణు దేశాయ్ ముందు పలు పాత్రలు క్యూ కట్టాయి. ప్రముఖ దర్శకులు మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలకు చెందిన ప్రతినిధులు రేణు దేశాయ్‌ ని సంప్రదిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రేణు దేశాయ్ ఏ ఒక్క సినిమా కి కూడా ఓకే చెప్పిన దాఖలాలు లేవు. అయినా కూడా ఆమెను సంప్రదించేందుకు కొత్త వారు లైన్ లో ఉంటూనే ఉన్నారు.

రేణు దేశాయ్ కంటిన్యూ గా సినిమాల్లో నటించాలని కోరుకోవడం లేదు. కానీ మంచి ఆఫర్‌ లు వస్తే వరుస సినిమాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా ఆమె సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చింది. కథ లో మంచి ప్రాముఖ్యతతో పాటు పాత్రకు హైప్‌ ఉండేలా ఆమె ప్లాన్‌ చేసుకుంటూ ఉంది.

కెరీర్‌ లో హడావుడి లేకుండా మెల్లగా సినిమాలు చేసుకోవాలి, మంచి పాత్ర లు ఎంపిక చేసుకోవాలి అనుకోవడం అనేది రేణు దేశాయ్ తీసుకున్న మంచి నిర్ణయం అన్నట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె ముందు ముందు ఇలా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేసే విషయమై తన నిర్ణయంపై కంటిన్యూ అయ్యేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.