Begin typing your search above and press return to search.

వైరల్‌ : రేణు దేశాయ్‌ పర్సనల్‌ సెక్యూరిటీ

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్నారు

By:  Tupaki Desk   |   19 Jan 2024 9:56 AM GMT
వైరల్‌ : రేణు దేశాయ్‌ పర్సనల్‌ సెక్యూరిటీ
X

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్నారు. ఆమె ఈ మధ్య కాలంలో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఇక తన పిల్లలు అకీరా మరియు ఆధ్యలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేయడం ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే.


రేణు దేశాయ్‌ ఈసారి తన ప్రైవేట్‌ సెక్యూరిటీ అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో ఆధ్య మార్షల్ ఆర్ట్స్ మూవ్స్ చేస్తూ ఉంది. కిక్స్ ఇస్తూ తన జోలికి వస్తే కుమ్మేస్తా అన్నట్లుగా ఆధ్య వీడియో కి ఫోజ్ లు ఇచ్చింది. ఆ వీడియోనే రేణు దేశాయ్ షేర్ చేయడం తో వైరల్‌ అయ్యింది.

ఆ వీడియో కు రేణు దేశాయ్... ఇకపై ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే నా వెనుక ఆధ్య ఉంది, నన్ను ఇబ్బంది పెట్టే వారు ఇకపై ఆధ్య తో పెట్టుకోవాల్సి ఉంటుంది. నా ప్రైవేట్‌ సెక్యూరిటీగా ఆధ్య మారుతుందని సరదా వ్యాఖ్యలను చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్న సంక్రాంతికి అకీరా మరియు ఆధ్య లు మెగా ఫ్యామిలీ తో కలిసి సందడి చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అకీరా చాలా పెద్ద వాడు అయ్యాడు అంటూ ఆయన ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయిన విషయం తెల్సిందే.

ఇక ఇప్పుడు ఆధ్య వీడియోను రేణు దేశాయ్ షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సింగిల్ పేరెంట్‌ గా లైఫ్ ను లీడ్ చేస్తున్న రేణు దేశాయ్ ఆ మధ్య కాలంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పెళ్లి పై ఈ మధ్య కాలంలో ఎలాంటి స్పందన లేదు.