Begin typing your search above and press return to search.

ఇలా చెప్పాక నాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తారని తెలుసు!

రేణు దేశాయ్ నిన్న తన సోషల్ మీడియా వేదికగా ఓ సీనియర్ జర్నలిస్ట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Dec 2023 9:05 AM GMT
ఇలా చెప్పాక నాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తారని తెలుసు!
X

రేణు దేశాయ్ నిన్న తన సోషల్ మీడియా వేదికగా ఓ సీనియర్ జర్నలిస్ట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నటీనటుల గురించి ఏం తెలియకుండా అనుభవమున్న పాత్రికేయులం అంటూ కొందరు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ముఖ్యంగా నాలాంటి మహిళలను సమాజంలో తక్కువగా చూస్తున్నారంటూ తనపై ఓ సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ను కూడా షేర్ చేసింది. ఇక తాజాగా మరోసారి ఇదే విషయంపై రేణు దేశాయ్ మరో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్టులో జర్నలిజం అంటే ఏంటి? సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం జర్నలిజం అవుతుందా? అంటూ ప్రశ్నించింది." నేను జర్నలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను? సెలబ్రిటీల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం నిజమైన జర్నలిజమా? సినిమా వల్ల పర్సనల్ లైఫ్ నిజంగానే సొసైటీని డిస్టర్బ్ చేస్తుందా? ఏది ఏమైనప్పటికీ ఫిలిం క్రిటిక్స్ కి సినిమాల గురించి వాళ్లు ఏం మాట్లాడినా వర్తిస్తుంది. ఆ ఫ్రీడమ్ వాళ్లకుంది. ఎందుకంటే అది ఫామ్ ఆఫ్ ఆర్ట్. అది కేవలం ప్రజల వినియోగం కోసమే.

కానీ మా డీటెయిల్ పర్సనల్ లైఫ్ కోసం కాదు. అలా అయితే ఇది జర్నలిజం కిందికే రాదు" అంటూ పేర్కొంది. అంతేకాకుండా.." యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ కారణంగా ఏ వ్యక్తి అయినా మన వ్యక్తిగత జీవితాల గురించి కూర్చుని మాట్లాడుకోవడం చాలా సాధారణ విషయం. కానీ దీన్ని చూసిన వాళ్లకి ప్రతికూల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజంలో ఉన్న సృజనాత్మక వ్యక్తులందరూ తమ పనుల్ని మానేస్తే ఏం జరుగుతుందో ఊహించుకోండి.

ఉదాహరణకు పెయింటింగ్, సినిమాలు తీయడం, పుస్తకాలు రాయడం, కవితలు రాయడం, సంగీతం లేదా పాడడం లాంటివి ఒకరోజు మానేస్తే జనాభాలో 95% ఏం చేస్తారో ఊహించుకోండి? శుక్రవారం ఎలాంటి కొత్త సినిమాలు విడుదల లేని జీవితాన్ని ఊహించుకోండి. అవును, ప్రపంచంలోని ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత జీవిత సమస్యలు ఉన్నాయి. ప్రేమలు, బ్రేకప్స్ కూడా ఉన్నాయి. మనం కూడా జీవితంలో తప్పులు చేస్తాం. కానీ కొంతమందికి మన బాధలు నైతికంగా లాభం పొందడం వాళ్లకు సరైనది అనిపిస్తుంది. విడిపోవడం లేదా విడాకులు తీసుకోవడం అనేది నేరం కాదు. నేను నా భావాలు మరియు భావోద్వేగాలు సంబంధాల గురించి మాట్లాడాలనుకుంటే అది నా ఎంపిక. ఆ వీడియోని చూడాలా వద్దా అనేది మీ ఇష్టం.

కానీ కొంతమంది మగవాళ్ళు కుర్చీలో కూర్చుని సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం గౌరవప్రదమైన జర్నలిజం కాదని నేను నమ్ముతున్నాను. నేను ఇలా నా గురించి వివరిస్తూ మరో 10 పేజీలు రాయగలను. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకరి వ్యక్తిగత సంబంధాల, సమస్యల నుండి ఆనందాన్ని పొందడం డబ్బు సంపాదించుకోవడం అనేది మంచి పని కాదు. ఈ పోస్టు తర్వాత చాలామంది నెగిటివ్ కామెంట్స్ తో నాపై దాడి చేస్తారని నాకు తెలుసు. కానీ నేను వ్యక్తం చేస్తుంది తప్పు కాదని మీకు కూడా తెలుసు" అంటూ తన సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చించి రేణు దేశాయ్.