మీ చదువు, జ్ఞానం సమాజం కోసం వాడండి.. మీడియాపై రేణూ ఫైర్
అయితే మిగిలిన అన్నింటినీ వదలేసి మీడియా కేవలం తన రెండో పెళ్లి విషయాన్నే హైలైట్ చేయడంపై రేణూ అసహనం వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టింది.
By: Tupaki Desk | 11 April 2025 11:27 PM ISTసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అన్ని అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే రేణూ దేశాయ్ రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో పలు విషయాలను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ మతం గురించి, బంధాల గురించి, సోషల్ మీడియా చూపుతున్న ప్రభావం గురించి, తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది.
అయితే మిగిలిన అన్నింటినీ వదలేసి మీడియా కేవలం తన రెండో పెళ్లి విషయాన్నే హైలైట్ చేయడంపై రేణూ అసహనం వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టింది. మీడియా మొత్తం తన రెండో పెళ్లి విషయంలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని తనకు అర్థమవుతుందని, తాను రీసెంట్ గా ఇచ్చిన గంట ఇంటర్వ్యూలో ఎన్నో విషయాల గురించి మాట్లాడానని కానీ అవన్నీ వదిలేసి కేవలం తన రెండో పెళ్లి విషయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థమవుతోందని రేణూ వెల్లడించింది.
దయచేసి 44 ఏళ్ల మహిళ పెళ్లి విషయం నుంచి అందరూ దృష్టి మరల్చి, తాను మాట్లాడిన ట్యాక్స్, ఉమెన్ సేఫ్టీ, ఎకనామికల్ గ్రోత్, వాతావరణ మార్పులు, మిగిలిన అంశాలపై దృష్టి పెడితే బావుంటుందని, అలా చేస్తే అందరం మంచి పౌరులుగా, మంచి మనుషులుగా మారతామని రేణూ చెప్పుకొచ్చింది. తన పెళ్లి గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడానని, తన పెళ్లి కేవలం తన జీవితాన్ని, తన చుట్టూ ఉండే వాళ్లను మాత్రమే ప్రభావితం చేస్తుందని ఆమె చెప్పింది.
కాబట్టి మీకున్న చదువు, విజ్ఞానం, జర్నలిజంలో ఉన్న ఎక్స్‌పీరియెన్స్ ను ఒక మహిళ రెండో పెళ్లి కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే వాటికి వాడాలని, తన పెళ్లేమీ సమాజాన్ని, చట్టాన్ని ప్రభావితం చేయదని రేణూ దేశాయ్ మీడియాపై అసహనం వ్యక్తం చేసింది. అదే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ స్పిరిట్యువల్ గా కూడా మాట్లాడింది.
పిల్లలకు గాయత్రి మంత్రం అడిగితే చెప్పడం రావడం లేదని, ఏ మంత్రం దేనికో ఉందో ఈ రోజుల్లో తల్లులకే తెలియడం లేదని, వాళ్లు పిల్లలకేం నేర్పుతారని అంటోన్న రేణూ తనకు హనుమాన్ చాలీసా, శివ రుద్రాష్టకం, రామ రక్ష అన్నీ తెలుసని, అవి నేర్చుకోవడానికి తాను చాలా రోజులు కష్టపడ్డానని తెలిపింది.
