రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి ఏమి చెప్పారు అంటే ?
అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, పిల్లల కోసమే ఇప్పటివరకు చేసుకోలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 7 July 2025 9:45 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ మాజీ భార్య, సీనియర్ యాక్ట్రెస్ రేణూ దేశాయ్ గురించి అందరికీ తెలిసిందే. నటిగా, నిర్మాతగా దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తల్లిగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పవన్ తో విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్యతో కలిసి జీవిస్తున్నారు.
అయితే తన పిల్లలు రెండో పెళ్లి చేసుకోమని ఎప్పటి నుంచో చెబుతున్నా, తాను వారు కోసం చేసుకోవడం లేదని ఇప్పటికే పలుమార్లు తెలిపారు. ఇప్పుడు మరో వివాహంపై క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తాను రెండో పెళ్లి చేసుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నానని రేణూ దేశాయ్ తెలిపారు. అందుకు మరి కొన్నేళ్లపాటు వెయిట్ చేయాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుంటానని, తనకు ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నానని రేణూ దేశాయ్ తెలిపారు.
అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, పిల్లల కోసమే ఇప్పటివరకు చేసుకోలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కానీ మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చినా కూడా.. అప్పట్లో పిల్లలు చిన్నవారు కావడంతో వాళ్లను వదిలి కొత్త జీవితం ప్రారంభించడం కరెక్ట్ కాదని అనిపించిందని అన్నారు.
అలా చేస్తే తన ఇద్దరు పిల్లలు ఒంటరితనంతో బాధపడతారనిపించిందని భావోద్వేగంగా గురయ్యారు. అయితే అకీరా, ఆద్య కూడా పెళ్లి చేసుకోమంటున్నారని తెలిపిన రేణు.. తన పిల్లలు కూడా మద్దతుగా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వారిద్దరూ రెండో పెళ్లి విషయంలో చాలా పాజిటివ్ గా ఉన్నారని అన్నారు.
ఎవరితో సంతోషంగా ఉంటావో వాళ్లను పెళ్లి చేసుకోమని చెప్పగా, తనకు ధైర్యంగా ఉందన్నారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తి స్వేచ్ఛ వస్తుందని, అప్పుడు కొత్త జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు కాలేజ్ కు వెళ్తే వాళ్లకు కొత్త వరల్డ్ ప్రారంభవుతుందని చెప్పిన రేణూ.. తల్లిదండ్రులపై డిపెండెంట్ గా ఉండరని అన్నారు.
అలాంటి సమయంలో తాను కూడా జీవితాన్ని ఆనందించగలుగుతానంటూ చెప్పుకొచ్చారు. అయితే, రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో యాక్ట్ చేసిన టైమ్ లో లవ్ లో పడ్డారు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయారు.
