Begin typing your search above and press return to search.

దేశాన్ని అద్దెకు తీసుకుని రాజులా బ్ర‌త‌కండి!

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ త‌న మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో విష‌యాలు పంచుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 May 2025 7:19 AM
దేశాన్ని అద్దెకు తీసుకుని రాజులా బ్ర‌త‌కండి!
X

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ త‌న మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో విష‌యాలు పంచుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల అంశాల‌పై ఆయ‌న మాట్లాడుతూ అవేర్ నెస్ క‌ల్పిస్తుంటారు. అందులో మంచి ..చెడు రెండూ ఉంటాయి. బాగుప‌డాలంటే మంచి...చెడిపోవాలంటే చెడు తీసుకోవ‌చ్చని ఆయ‌న ప్ర‌తీ ఆడియోలో కామ‌న్ గా చెబుతుంటారు. తాజాగా పూరి ఓ దేశం గురించి చెప్పి...కావాల‌నుకుంటే ఆ దేశానికి రాజు మీరు కూడా అవ్వొచ్చు అంటూ మ‌రో కొత్త విష‌యం పంచుకున్నారు. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

`ఓ దేశాన్ని అద్దెకు తీసుకొవ‌చ్చు అని తెలుసా? చాలా మందికి తెలియ‌ని ఓ చిన్న దేశం ఉంది. ఆ దేశం పేరు లిక్ట‌న్ స్టైన్. 160 చ‌ద‌ర‌పు కి.మీ విస్తీర్ణంలో ఉంటుంది. కారు లో అర‌గంట‌లో చుట్టేయోచ్చు. ఎన్నో విమాన‌శ్ర‌యాల కంటే చిన్న‌ది. ఆ దేశం స్విట్జ‌ర్లాండ్-ఆస్ట్రియా మ‌ధ్య ఉంది. ఆ దేశాన్ని ఓరాజు ప‌రి పాలిస్తున్నాడు. ఆ రాయ‌ల్ ఫ్యామిలీ ఓ కొండ‌పైన ఉంటుంది. రోమ‌న్ క్యాథ‌లిక్స్ ఉండే దేశ‌మ‌ది.

వారు జ‌ర్మ‌న్ మాట్లాడుతారు. ఈ దేశానికి వాయు మార్గం..జ‌ల మార్గం లేవు. జ్యూరిక్ నుంచి రైల్లోగానీ, కారుకానీ వెళ్లొచ్చు. భ‌ద్ర‌త ఎక్కువ ఉండే దేశాల్లో ఇదొక‌టి. జ‌నాభా 40 వేలు కూడా ఉండ‌రు. క్రైమ్ రేట్ లేక‌పోవ‌డం వ‌ల్ల అక్క‌డి వారు ఇళ్ల‌కు తాళాలు కూడా వేయ‌రు. వారంతా ఒక‌రికొక‌రు ప‌రిచ‌యం. ట్యాక్స్ బెనిఫిట్ కోసం బ‌య‌ట వారు అక్క‌డ పెట్టుబ‌డులు పెడుతుంటారు.

నేష‌న‌ల్ హాలీడేస్... పండ‌గ‌ల వేళ అక్క‌డి ప్ర‌జ‌లు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రిస్తారు. ఆగ‌స్టు 15 వారి నేష‌న‌ల్ డే. కావాల‌నుకుంటే 70 వేల డాల‌ర్లు చెల్లించి మీరు ఈ దేశాన్ని ఒకరోజు అద్దెకు తీసుకొవ‌చ్చు. అప్పుడు మీకు వారంతా రెడ్ కార్పెట్ తో స్వాగ‌తం ప‌లుకుతారు. రాయ‌ల్ ప్యాలెస్ లో వ‌స‌తి ఏర్పాటు చేస్తారు. స్ట్రీట్ బోర్స్డ్ మీ పేరిట వెలుస్తాయి. మిమ్మ‌ల్ని ఓ రాజులా ట్రీట్ చేస్తారు. మీ ఫోటోతో ఫేక్ క‌రెన్సీ కూడా క్రియేట్ చేస్తారు. దాంతో అక్క‌డ ఏం కావాల‌న్నా కొనుక్కోవ‌చ్చు. టూరిస్టుల‌తో అక్క‌డి వారు ఎంతో ప్రేమ‌గా ఉంటారు` అని అన్నారు.