Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో.. రెమ్యునరేషన్ సమస్య!

అయితే మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ అనుకున్నంత అద్భుతంగా అయితే నడవడం లేదు.

By:  Tupaki Desk   |   1 Dec 2023 4:15 AM GMT
మెగాస్టార్ తో.. రెమ్యునరేషన్ సమస్య!
X

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని ఎప్పటికి తక్కువ అంచనా వేయకూడదు. తనదైన రోజున ఎలాంటి అద్భుతాలు అయిన సృస్టించగల సామర్ధ్యం ఉంది. సుదీర్ఘ సినీప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు అధికమించారు. కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేశారు. అయితే మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ అనుకున్నంత అద్భుతంగా అయితే నడవడం లేదు.

సెకండ్ ఇన్నింగ్ లో మెగాస్టార్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేస్తే అందులో ఒక్క వాల్తేర్ వీరయ్య మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలు ఏవీ నిర్మాతలకి భారీ లాభాలు అయితే అందించలేదు. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి కమర్షియల్ జోనర్ లోనే రొటీన్ ఫార్మాట్ కథలతో సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ ఇమేజ్ ఫ్యాన్స్ ని థియేటర్స్ కి రప్పించిన ఆ తరువాత రిజల్ట్ రెగ్యులర్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతుంది.

మెగాస్టార్ సినిమాకి 50 కోట్లనుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. హీరో రెమ్యునరేషన్ తో పాటు మిగిలిన క్యాస్టింగ్, క్రూ, షూటింగ్ బడ్జెట్ మరో 70 కోట్లకి పైనే అవుతుంది. దీంతో మెగాస్టార్ సినిమాల ఓవరాల్ బడ్జెట్ 130 నుంచి 150 కోట్ల మధ్య ఉంటున్నాయి. అయితే ఒకప్పటిలా మెగాస్టార్ సినిమాలు లాంగ్ రన్ కలెక్షన్స్ ని సాధించలేకపోవడంతో ఈ బడ్జెట్ రికవరీ కష్టం అయిపోతుంది.

ఈ మధ్యకాలంలో ఓటీటీ మార్కెట్ కూడా తగ్గిపోయింది. సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటేనే ఓటీటీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. లేదంటే మూవీ రిలీజ్ తర్వాత డీల్ మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి సినిమాలకి అంతగా ఓటీటీ రైట్స్ రావడం లేదు. ఈ లెక్కలన్నీ చూసుకొని మెగాస్టార్ మీద భారీ బడ్జెట్ లు పెట్టడానికి నిర్మాతలు ధైర్యం చేయలేదు.

అయితే మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సినిమాకి మాత్రం యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం కథలో దమ్ము ఉండటమే అని తెలుస్తోంది. ఇప్పటి వరకు మెగాస్టార్ నుంచి వచ్చి రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ లో కాకుండా కొత్తదనం ఉన్న కథ, కథనంతో విశ్వంభర సినిమా వశిష్ట చేస్తున్నారు. అందుకే కాస్తా రిస్క్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. కానీ ఇటీవల అనిల్ రావిపూడి ప్రాజెక్టు విషయంలో మాత్రం నిర్మాత దిల్ రాజు ఆ రేంజ్ లో మెగాస్టార్ కు రెమ్యునరేషన్ ఇవ్వడంలో కొంత ఆలోచనలో పడ్డట్లు టాక్. అలాగే లిస్టులో మరికొందరు కమర్షియల్ దర్శకులు ఉన్నారు. ఇక వారితో కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ నిర్మాత దొరకడం కాస్త లాష్టమవుతున్నట్లు టాక్.