Begin typing your search above and press return to search.

హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్ 300 కోట్లు దాటేలా ఉంది

ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్మతల నుంచి 150 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 May 2024 3:30 PM GMT
హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్ 300 కోట్లు దాటేలా ఉంది
X

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ మార్కెట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ అయ్యేవి. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కంటెంట్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో క్లిక్ అవుతుండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు లిమిట్స్ లేకుండా ఊహించని స్థాయిలో మార్కెట్ ను అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి.

ఇక వరుసగా ఫెయిల్యూర్స్ తో ఆ మధ్య మార్కెట్ కోల్పోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసాడు. జైలర్ సినిమాతో ఆయన క్రియేట్ చేసిన రికార్డులు ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీంతో బడ నిర్మాతలు మళ్లీ ఆయనతో బిగ్ బడ్జెట్ సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసు దాటినా కూడా అదే స్టార్ హోదాతో కొనసాగుతూ ఉండడం విశేషం.

ఇప్పుడు రాబోయే కూలి సినిమా కూడా మార్కెట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. టాలెంటెడ్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమా ఇంట్రో టీజర్ కూడా ఇటీవల మంచి హైప్ క్రియేట్ చేసింది. గోల్డ్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ గతంలో ఎప్పుడూ లేనంత డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆయన పాత్రలో కొంత నెగిటివ్ షెడ్ కూడా హైలెట్ కాబోతున్నట్లు సమాచారం. ఇక లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న అతను ఆ తర్వాత లియో సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మార్కెట్లో మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు కూలీ సినిమా రెమ్యునరేషన్స్ గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్మతల నుంచి 150 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సక్సెస్ అయితే అందులో షేర్ కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా కూడా మొత్తంగా సూపర్ స్టార్ కు 250 కోట్ల రేంజ్ లో ఆదాయం దక్కే అవకాశం ఉంది.

ఇక లోకేష్ కోసం నిర్మాతలు దాదాపు 60 కోట్ల వరకు పారితోషం ఇస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. అంటే దాదాపు వీరి పారితోషకాలే 300 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది నిజమైతే మాత్రం దేశంలోనే ఇవి బిగ్గెస్ట్ డీల్స్ అని చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని కాంబినేషన్స్ కూడా ఇదే తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాయి. ఇక కూలీ సినిమాకు దాదాపు 350 వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.