రెమ్యూనరేషన్ తో స్పెషల్ సాంగ్స్ మరింత స్పెషల్
ఇండియన్ సినిమాలో డ్యాన్స్ నెంబర్లు ఎప్పటినుంచో భాగమైన విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్స్ ను ఎప్పుడైతే హీరోయిన్లు చేయడం మొదలుపెట్టారో అప్పట్నుంచి వాటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది.
By: Tupaki Desk | 28 April 2025 1:30 AMఇండియన్ సినిమాలో డ్యాన్స్ నెంబర్లు ఎప్పటినుంచో భాగమైన విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్స్ ను ఎప్పుడైతే హీరోయిన్లు చేయడం మొదలుపెట్టారో అప్పట్నుంచి వాటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. హీరోయిన్లు ట్రాక్ లోకి రావడంతో ఈ సాంగ్స్ ను స్పెషల్ సాంగ్స్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్స్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఒక సినిమాను మించి మరో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఖర్చు పెడుతూ మేకర్స్ ఆ సాంగ్ ను మరింత స్పెషల్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లను తీసుకుని వారితో ఆ స్పెషల్ సాంగ్ ను చేయించి వారికి భారీ రెమ్యూనరేషన్ ను ముట్టజెప్పుతున్నారు. డ్యాన్స్ తో సంబంధం లేకుండా వారి మార్కెట్, క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో నిర్మాతలు సదరు హీరోయిన్లకు ఎంత అడిగితే అంత ఇస్తూ వస్తున్నారు.
నోరా ఫతేహి లాంటి బాలీవుడ్ డ్యాన్సర్లు ఒక్కో సాంగ్ చేయడానికి రూ.2 కోట్లు ఛార్జ్ చేస్తుండగా, సన్నీ లియోన్ కూడా అంతే తీసుకుంటున్నట్టు సమాచారం. కెవ్వు కేక సాంగ్ లో కాలు కదిపిన మలైకా అరోరా ఖాన్ రూ. 50 లక్షల నుంచి రూ.1 వరకు తీసుకుందన్నారు. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించాలంటే రూ. 1.5 కోట్లు ఇవ్వాల్సిందే.
కత్రీనా కైఫ్ ఒక్కో సాంగ్ కు రూ. 2 కోట్లు తీసకుంటే, స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం రూ.3 కోట్లు తీసుకుంటుంది. ఊర్వశీ రౌతెలా కూడా రూ. 3 కోట్లు ఛార్జ్ చేస్తుందని, దబిడి దిబిడి సాంగ్ తర్వాత తన డిమాండ్ ఇంకా పెరిగిందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్స్ చేస్తున్న వారిలో సమంత, తమన్నాటాప్ లో ఉన్నారు.
పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ అయిన ఊ అంటావా సాంగ్ కు సమంత ఏకంగా హీరోయిన్ రష్మిక కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంది. రష్మిక పుష్ప కోసం రూ. 2 కోట్లు తీసుకుంటే సమంత మాత్రం ఆ ఒక్క సాంగ్ కోసం రూ.5 కోట్లు తీసుకుందట. ఇక తమన్నా రీసెంట్ టైమ్స్ లో ఐటెం సాంగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. స్వింగ్ జర సాంగ్ తో మొదలుపెట్టిన తమన్నా తర్వాత అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ వచ్చింది. జైలర్ సినిమాలో కావాలయ్యా సాంగ్ తో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్న తమన్నా ఆ తర్వాత స్త్రీ2లో కనిపించి అందరినీ మరోసారి అలరించింది. తాజాగా రైడ్2 లో కూడా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని వార్తల్లోకెక్కింది.