Begin typing your search above and press return to search.

ఆ కామెడీ రీమేక్.. రిస్కేమో రాజుగారు?

దిల్​ రాజు దీన్ని నిర్మించబోతున్నారని, మాతృక డైరెక్టర్​ అనిల్ రావిపూడియే దీనికి కూడా దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 8:04 AM GMT
ఆ కామెడీ రీమేక్.. రిస్కేమో రాజుగారు?
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్కెట్​ డైనమిక్స్​ను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా సినిమాలను నిర్మించి క్యాష్ చేసుకుంటారన్న పేరు ఉంది. అయితే ఇప్పుడాయన ఓ తప్పును మళ్లీ రిపీట్ చేయబోతున్నారని అనిపిస్తోంది. అనవసరంగా లేని సమస్యలను తల మీద వేసుకోబోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళితే.. 2019లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ఎఫ్​ 2 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్​ రాజు దీన్ని నిర్మించబోతున్నారని, మాతృక డైరెక్టర్​ అనిల్ రావిపూడియే దీనికి కూడా దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాబోతుందని చెబుతున్నారు. ఈ వార్తలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ ఎంత వరకు ఈ రీమేక్ సక్సెస్​ అవుతుందా అంటే అనుమానాలే ఎక్కువ వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే ఎఫ్ 2 కామెడీ... 2019లో హిట్ అయిపోయింది కానీ ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన విధానం మరింత మారిపోయింది. ఇప్పుడలాంటి సిల్లీ కామెడీని ఆదరించే పరిస్థితుల్లో వారు లేరని అనిపిస్తోంది. ఇప్పుటికే ఆ చిత్రాన్ని యూట్యూబ్​ హిందీ డబ్బింగ్​ వెర్షన్​లో చాలా మంది చూసేశారు. మరి ఇలాంటి సమయంలో మరో ఇద్దరు హీరోలతో కలిసి ఈ సినిమా హిందీలో రీమేక్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటే? కాదనే అనిపిస్తోంది.

అసలే దిల్ రాజు ఇప్పటికే జెర్సీ, హిట్ లాంటి చిత్రాలను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ చిత్రాలు కనీసం రూ.10కోట్లను కూడా అందుకోలేదు. పైగా దిల్ రాజు ప్రస్తుతం రామ్​చరణ్​ గేమ్ ఛేంజర్ సినిమాతో ఇబ్బందులను, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాకు తానే నిర్మాత అయినప్పటికీ కూడా దాని గురించి ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇలాంటి కష్టపరిస్థితుల్లో ఎఫ్​ 2 లాంటి చిత్రాన్ని రీమేక్​ చేయడం సరైనది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవి దిల్​ రాజును మరిన్ని కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి మరి దిల్ రాజు ఏం చేస్తారో...