Begin typing your search above and press return to search.

లాల్ సింగ్ చ‌డ్డా.. రిగ్రెట్ అన్న‌దే లేద‌న్న చై

లాల్ సింగ్ చద్దా పరాజయం వ‌ల్ల అస్సలు విచారం లేదు... నేను చాలా సంతోషంగా ఉన్నాను! అని నాగ‌చైత‌న్య అన్నాడు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:33 PM GMT
లాల్ సింగ్ చ‌డ్డా.. రిగ్రెట్ అన్న‌దే లేద‌న్న చై
X

ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, సమంత రూత్ ప్రభు, విజయ్ సేతుపతి సహా ప‌లువురు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ పాపుల‌ర్ స్టార్లు బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. 2022లో నాగ చైతన్య కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే అతడి తొలి చిత్రం- లాల్ సింగ్ చద్దా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అమీర్ ఖాన్ సినిమాతో అక్కినేని హీరో ఘ‌న‌మైన ఎంట్రీని ఆశించాడు. కానీ అమీర్ తలపెట్టిన కార్యం సిద్ధించ‌లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ప్రదర్శన ఇవ్వలేదు. పైగా క్రిటిక‌ల్ గా చాలా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. ఇటీవల, తన OTT తొలి షో దూత ప్రమోషన్ల సందర్భంగా నాగ‌ చైతన్య లాల్ సింగ్ చ‌డ్డా పరాజయాన్ని ప్రస్తావించాడు. ఆ వైఫ‌ల్యంపై తన ఆలోచనలను పంచుకున్నాడు.

లాల్ సింగ్ చద్దా పరాజయం వ‌ల్ల అస్సలు విచారం లేదు... నేను చాలా సంతోషంగా ఉన్నాను! అని నాగ‌చైత‌న్య అన్నాడు. కామెడీ-డ్రామాపై సానుకూల దృక్పథాన్ని కొనసాగించాడు చై. లాల్ సింగ్ చ‌డ్డాలో నేను అమీర్‌తో కలిసి పని చేసాను.. కాబట్టి అస్సలు విచారం లేదు. నేను ఆ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

నాట‌చైత‌న్య కొంత ఫిలాస‌ఫిక‌ల్ గా మాట్లాడుతూ..``నిజాయితీగా చెప్పాలంటే జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. విజయం వైఫల్యం రెండింటి విష‌యంలో ఆత్మపరిశీలన చేసుకోవడం ముఖ్యం. కానీ వెనక్కి తిరిగి చూడకండి. ఇప్పుడే ముందుకు సాగండి`` అని అన్నాడు. లాల్ సింగ్ చ‌డ్డా హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్‌. ఫారెస్ట్ గంప్ 1994లో విడుదలైంది. ఐదు అకాడమీ అవార్డులను అందుకుంది. అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి స్టోరీని అతుల్ కులకర్ణి రాశారు. అద్వైత్ చందన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో చైతన్య- అమీర్‌ ఖాన్‌లతో పాటు కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్ త‌దిత‌రులు నటించారు. నాగచైత‌న్య ప్రస్తుతం సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ షో `దూత`లో న‌టించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం దూత సిరీస్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది.

కొన్ని సినిమాలు ఫెయిలైన‌ప్పుడు రిగ్రెట్ ఫీలైనా ప్ర‌యోజనం ఉండ‌దు. ఇంత‌కుముందు రామ్ చ‌ర‌ణ్ జంజీర్ అనే ఒక హిందీ సినిమాలో న‌టించారు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయింది. కానీ దానికి రిగ్రెట్ పీల‌వ్వ‌లేదు మెగా హీరో. నాగ‌చైత‌న్య కూడా `లాల్ సింగ్ చ‌డ్డా` ఫెయిలైనా దానిని రిగ్రెట్ ఫీల్ కాలేదు. ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్` ఫెయిల్యూర్ విష‌యంలోను రిగ్రెట్ క‌నిపించ‌లేదు. మ‌న హీరోలు నెక్ట్స్ ఏంటి? అనేదానిపైనే దృష్టి సారిస్తున్నారు.