Begin typing your search above and press return to search.

రెజీనా కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందా..?

సినిమాల్లో అవకాశాలు అందుకోవడం కోసం కొందరిని సంప్రదించానని చెప్పింది. వారిలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి అవకాశాలు రావాలంటే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పారట.

By:  Tupaki Desk   |   17 Aug 2023 10:09 PM IST
రెజీనా కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందా..?
X

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా అందరికీ పరిచయమే. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లోనూ నటించి అందరినీ ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగకపోయినా, మిడ్ రేంజ్ హీరోలతో మాత్రం నటించింది. చాలా కాలంగా ఇండస్ట్రీలో వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన రెజినా, తన కెరీర్ లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందట.

2005లొ కండనాళ్ మొదల్ అనే చిత్రంతో తన కెరీర్ ని మొదలుపెట్టింది రెజీనా. ఆ మూవీ మంచి హిట్ అందుకోవడంతో అన్ని భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గినా, వెబ్ సిరీస్ లలో మాత్రం ఆకట్టుకుంటోంది. అయితే, ఇటీవల రెజీనా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యానని ఆమె చెప్పడం గమనార్హం.

రెజీనా పదిహేడు సంవత్సరాల వయసులో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఆ సమయంలో తనకు ఊహించని సంఘటనలు ఎదురయ్యాయని ఆమె చెప్పింది. సినిమాల్లో అవకాశాలు అందుకోవడం కోసం కొందరిని సంప్రదించానని చెప్పింది. వారిలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి అవకాశాలు రావాలంటే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పారట. ముందు అడ్జస్ట్ కి ఒకే చెబితే, తర్వాత వెంటనే షూటింగ్ కి వెళ్లొచ్చు అని చెప్పాడట. ఈ మాట విని ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలు అయ్యింది అని ఆమె చెప్పారు.

ఆ సమయంలో తన వయసు కేవలం 20ఏళ్లు అని చెప్పింది. అయితే, అతని మాటలు ముందు తనకు అస్సలు అర్థం కాలేదని, రెమ్యూనరేషన్ గురించి అడుగుతున్నారేమో అనుకున్నానని, మా మేనేజర్ తో మాట్లాడి చెబుతాను అని ఫోన్ పెట్టేశానని ఆమె చెప్పింది. అయితే, తర్వాత మేనేజర్ తో మాట్లాడిన తర్వాత దాని అర్థం తనకు తెలిసిందని ఆమె చెప్పారు.

తనకు ఎదురైన మొదటి చేదు అనుభవం అదేనని, తర్వాత మళ్లీ అలాంటి సంఘటన ఎదురు కాలేదని ఆమె చెప్పారు. కాగా, ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు తాము క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యామని చెప్పారు. రెజినా ఇంతకాలం తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టడం గమనార్హం.