Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెజీనా టూ హాట్

కానీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం హాట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఇక్క‌డ అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంది. మ‌రోవైపు త‌మిళంలో క్రేజీ చిత్రాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 3:30 AM GMT
ఫోటో స్టోరి: రెజీనా టూ హాట్
X

రెజీనా కసాండ్రా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సాయిధ‌ర‌మ్ స‌హా యువ‌హీరోల‌ స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ ఇటీవ‌ల టాలీవుడ్ స‌ర్కిల్స్ కి దూర‌మైంది. కానీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం హాట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఇక్క‌డ అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంది. మ‌రోవైపు త‌మిళంలో క్రేజీ చిత్రాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ఇప్పుడు త‌ళా అజిత్ స‌ర‌స‌న జాక్ పాట్ అందుకుంది. అజిత్ స‌ర‌స‌న 'విదాముయార్చి'లో భాగమని రెజీనా స్వ‌యంగా ధృవీకరించింది.


తమిళంలో చివరిగా 'కరుంగాపియం'లో కనిపించిన నటి రెజీనా కసాండ్రా, మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో 'విదాముయార్చి' స్టార్ కాస్ట్‌లో చేరినట్లు ఇటీవలే రివీలైంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి అధికారికంగా ఎటువంటి అప్‌డేట్ రానప్పటికీ, టీమ్ ఇప్పటికే అజర్‌బైజాన్‌లో షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు నటి రెజీనా కసాండ్రా తాను భారీ బడ్జెట్ చిత్రంలో భాగమైనందుకు ఆనందం వ్య‌క్తం చేసింది. ఇందులో అజిత్ కుమార్ సరసన నటి త్రిష కథానాయికగా నటిస్తుండ‌గా, త‌న‌కు రెండో నాయిక‌గా అవకాశం ద‌క్కింది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ట్రాకర్ యొక్క సోషల్ మీడియా పోస్ట్ తో రెజీన ఈ విష‌యాన్ని ధృవీకరించింది. త్వరలో అజిత్ తో సెట్‌లో జాయిన్ అవుతుందని కూడా స‌ద‌రు సైట్ వెల్లడించింది. ఆమె త్వరలో అజర్‌బైజాన్‌లో సెట్‌లో టీమ్‌తో చేరనుంది.

మ‌రోవైపు రెజీనా కసాండ్రా చాలాకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'శూర్పనాగై' విడుదల కోసం వేచి ఉంది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న అరుణ్ విజయ్ నటించిన 'బోర్డర్'లోను రెజీనా క‌థానాయిక‌గా న‌టించింది. త‌మిళ ప‌రిశ్ర‌మ‌తో పాటు తెలుగులోను అవ‌కాశాల కోసం రెజీనా ప్ర‌య‌త్నిస్తోంది.