Begin typing your search above and press return to search.

ఫోటో గ్లింప్స్‌: ఒర్రీతో రెజీనా వ్వావ్!

బాలీవుడ్ లో సెల‌బ్రిటీ కిడ్స్ తో నిరంత‌రం పార్టీలు, ఫంక్ష‌న్ల‌లో క‌నిపిస్తుంటాడు ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి

By:  Tupaki Desk   |   23 April 2024 3:00 AM GMT
ఫోటో గ్లింప్స్‌: ఒర్రీతో రెజీనా వ్వావ్!
X

బాలీవుడ్ లో సెల‌బ్రిటీ కిడ్స్ తో నిరంత‌రం పార్టీలు, ఫంక్ష‌న్ల‌లో క‌నిపిస్తుంటాడు ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి. ఇలా నిరంత‌రం పార్టీ కిడ్స్ తో కాల‌యాప‌న చేస్తే జీవించ‌డానికి సంపాద‌న ఎలా? డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? అంటూ ఒర్రీని ఆట‌ప‌ట్టించ‌గా, అత‌డు ఒక్కో ఈవెంట్ కి హాజ‌రైనందుకు త‌న‌కు ల‌క్ష‌ల్లో చెల్లిస్తార‌ని తెలిపాడు. త‌న ప్ర‌ధాన ఆదాయ‌వ‌న‌రు ఇదేన‌ని కూడా వెల్ల‌డించాడు.

ఇప్పుడు అత‌డు యంగ్ హీరోయిన్ రెజీనా, ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి వంటి ప్ర‌ముఖుల‌తో క‌లిసి హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ లాంచింగ్ ఈవెంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ముఖ్యంగా ఓర్రీతో రెజీనా స్పెషల్ ఫోటోగ్రాఫ్స్ ఈవెంట్ నుంచి వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి. ఇంత‌కీ అత‌డు దేనికోసం హైద‌రాబాద్ వ‌చ్చాడు? అంటే పాపుల‌ర్ స్టూడియో లాంచింగ్ కోసం అత‌డు ఇక్క‌డ అడుగుపెట్టాడు. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో క‌లిసి వెన్యూ వ‌ద్ద ఫోజులిచ్చాడు. రెజీనా అంద‌మైన డిజైన‌ర్ ఫ్రాక్‌లో అగ్గి రాజేసింది. ఒర్రీ చాలా సింపుల్ లుక్ లో క‌నిపించారు.

ప‌ర్యావ‌ర‌ణంపై స్పృహ అవ‌స‌రం: రెజీనా

రెజీనా ఇటీవ‌ల చెన్నైలోని బీచ్ క్లీన్ అప్‌లో పాల్గొంది. ఆ సమయంలో మన పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడం గురించి .. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల గురించి కూడా మాట్లాడింది. ఒక సెలబ్రిటీ సామాజిక కారణాల గురించి మాట్లాడటం తప్పనిసరి అని నేను అనుకోను. అయితే ఒక సెలబ్రిటీ లేదా ప్లాట్‌ఫారమ్ ఉన్న ఎవరైనా ఇతరులను ఎనేబుల్ చేయడానికి దాన్ని ఉపయోగించాలని నేను నమ్ముతున్నాను అని రెజీనా చెప్పింది. రెజీనా కసాండ్రా పర్యావరణ పరిరక్షణ కోసం తాను ఎప్పుడూ మాట్లాడుతుంటానని పేర్కొంది. ఎర్త్ డేలో భాగంగా ఈ వ్యాఖ్య‌లు చేసింది.

మన పర్యావరణంతో మనం ఎలా చెలగాటమాడుతున్నామో అర్థం చేసుకోవాలి. నేను నా గురించి నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే స్పృహను క‌లిగి ఉండటం.. అంద‌రితో క‌లిసి నేర్చుకునే ఒక పెంపకాన్ని కలిగి ఉండటం నా అదృష్టం. కానీ జంతువులు, పర్యావరణంలో మార్పులు.. మన చుట్టూ ఉన్న నీరు లేదా భూమిపై ఎలా గందరగోళానికి గురవుతున్నామో కూడా తెలుసుకోవాలి. మన చర్యలు మన పర్యావరణంపై చూపే ప్రభావాలను మనం అర్థం చేసుకోవాలి... అని రెజీనా అన్నారు.

కెరీర్ జ‌ర్నీ:

ప్ర‌స్తుత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే రెజీనా వరుస చిత్రాల‌తో బిజీగా ఉంది. త‌ళా అజిత్ విదా ముయార్చిలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న రెజీనా, బోర్డ‌ర్, ఫ్లాష్ బ్యాక్, సెక్ష‌న్ 108 అనే చిత్రాల్లోను న‌టిస్తోంది. ఇవ‌న్నీ ఈ ఏడాది విడుద‌ల‌కు రానున్నాయి.