Begin typing your search above and press return to search.

అక్క‌డా సౌత్ భామ‌లు స‌త్తా చాటాలంటోన్న రెజీనా!

రెజీనా క‌సాండ్రా టాలీవుడ్ లో అప్పుడ‌ప్పుడు క‌నిపించినా? కోలీవుడ్ ..బాలీవుడ్ లో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   19 May 2025 6:00 AM IST
అక్క‌డా సౌత్ భామ‌లు స‌త్తా చాటాలంటోన్న రెజీనా!
X

రెజీనా క‌సాండ్రా టాలీవుడ్ లో అప్పుడ‌ప్పుడు క‌నిపించినా? కోలీవుడ్ ..బాలీవుడ్ లో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది. సొంత భాష త‌మిళం అమ్మ‌డిని బాగా ఆదుకుంది. వ‌చ్చిన అవ‌కాశాల్ని వినియోగిం చుకుని ఖాళీ లేకుండా ప‌నిచేస్తోంది. ఆరేడేళ్ల‌గా బాలీవుడ్ లో నూ సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `జాట్`, `కేస‌రి చాప్ట‌ర్ 2` చిత్రాల‌తో మంచి విజ‌యాలు అందుకుంది. న‌టిగా రెజీనా మ‌రింత పరిణ‌తి చెందింది.

ఐటం పాట‌ల్లో సైతం అల‌రిస్తుంది. తాజాగా రెజీనా సౌత్..నార్త్ భామ‌ల‌ను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే.. ` నేను పంజాబీ అమ్మాయి పాత్ర పోషించ‌లేను. పోషించినా అది ప‌రిపూర్ణం కాదు. కానీ ఒక పంజాబీ అమ్మాయి సౌత్ లో ఎలాంటి పాత్ర వ‌చ్చినా పోషించ‌గ ల‌దు. అలాంటి వారిని చాలా క్లోజ్ గా చూసాను. సొంత భాష‌లో సినిమాలు చేయ‌డం ఏ న‌టికైనా కంప‌ర్ట్ గానే ఉంటుంది.

కానీ ఒకే భాష‌కు ప‌రిమిత‌మైతే న‌టిగా ప‌రిపూర్ణం అయిన‌ట్లు కాదు. ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్ర ప్ర‌భావ వంతంగా ఉండాలి. రెజీనా మంచి పాత్ర పోషించింద‌ని మాట్లాడుకోవాలి. అంత ప్రభావాన్ని చూప గలిగే స్థాయికి చేరుకోవాలనేది నా ఆకాంక్ష. సౌత్ భామ‌లు నార్త్ లో ఎక్కువ సినిమాలు చేయాల‌ని కోరుకుం టున్నాను. అంద‌కు భాష అడ్డంకిగా మార‌కూడ‌దు. 20 సంవత్స రాలుగా పరిశ్రమలో ఉంటున్నాను.

2018 నుండి హిందీ సినిమాలు చేస్తున్నాను. ఈ ప్ర‌యాణంలో సౌత్ భామ‌లు నార్త్ లో క‌నిపించింది చాలా త‌క్కువ‌. అక్క‌డ ప‌రిశ్ర‌మ‌లో మ‌న వాళ్ల‌ను చూడాల‌నుకుంటున్నాను. నేను హిందీలో ప్రావీణ్యం సంపా దించాను. చ‌ద‌వ‌గ‌ల‌ను..రాయ‌గ‌ల‌ను. కానీ మ‌రింత ప‌ర్పెక్ష‌న్ కోసం హిందీ ట్యూట‌ర్ కూడా ఉన్నారు. భాషపై ఎంత ప‌ట్టుంటే? అంతగా ప‌రిశ్ర‌మ‌లో రాణించ‌గ‌లం` అంది.