యాక్టింగ్ మానేద్దామనుకున్నా!
ఇంతటి భారీ కాంపిటీషన్ లో కూడా ఇరవై ఏళ్ల మైలు రాయిని అందుకున్నారు నటి రెజీనా కసాండ్రా.
By: Tupaki Desk | 23 July 2025 6:00 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత కెరీర్ టైమ్ హీరోయిన్లకు ఉండదు. హీరోలకు వయసుతో సంబంధం లేకుండా ఆఫర్లొస్తే హీరోయిన్లకు మాత్రం కేవలం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఆఫర్లు వస్తుంటాయి. అందులోనూ మళ్లీ విపరీతమైన కాంపిటీషన్. ఇంతటి భారీ కాంపిటీషన్ లో కూడా ఇరవై ఏళ్ల మైలు రాయిని అందుకున్నారు నటి రెజీనా కసాండ్రా.
మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రెజీనా, 2005లో ఓ తమిళ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2010లో సుధీర్ బాబుతో కలిసి ఎస్ఎమ్ఎస్ అనే సినిమాలో నటించి ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఆ తర్వాత కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు. అ..! ఎవరు లాంటి సినిమాల్లో విభిన్న రోల్స్ చేసి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచిన రెజీనా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా ముందుకొచ్చి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లవుతున్నా తానింకా కొన్ని విషయాల్లో టాప్ ప్లేస్ లో లేనన్నారు. గత కొన్నేళ్లుగా తాను వరుసపెట్టి సినిమాలు చేయడం లేదని, అయినప్పటికీ 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగడమంటే చిన్న విషయం కాదని, 20 ఏళ్ల కెరీర్ ను మైల్ స్టోన్ గా ఎందుకు చూస్తారో తనకు ఇప్పుడే అర్థమైందని చెప్పిన రెజీనా కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు.
మధ్యలో వర్క్ చేయాలనిపించక యాక్టింగ్ మానేద్దామని డిసైడ్ అయినట్టు చెప్పిన రెజీనా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశానని, ఆ తర్వాత 2018 నుంచి మళ్లీ వరుస ఛాన్సులొచ్చాయని చెప్పారు. ఒకేలాంటి పాత్రలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నట్టు రెజీనా తెలిపారు. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో ఉదయం 6 గం.లకే డైలాగ్ పేపర్ తెచ్చి ఇచ్చేవాళ్లని, కానీ ఆ టైమ్ లో తెలుగు రాకపోవడంతో ఎంతో కష్టమైందని రెజీనా చెప్పారు.
డైలాగులన్నింటినీ బాగా శ్రమించి కంఠస్థం చేసి, అందులోని ఎమోషన్స్ ను అర్థం చేసుకుని లైన్ టూ లైన్ ప్రాక్టీస్ చేసేదాన్నని, ఇండస్ట్రీకి వచ్చేముందు యాక్టింగ్ అంటే సినిమాలో నటించి, వచ్చేయడమే అనుకున్నానని, అప్పట్లో పీఆర్, సోషల్ మీడియా కు ఉన్న ప్రాధాన్యత తెలియలేదని తర్వాత్తర్వాత అన్నీ అలవాటయ్యయని, ఇప్పుడు సోషల్ మీడియా వల్లే తన పనిని ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నట్టు రెజీనా తెలిపారు. ప్రస్తుతం సుందర్. సి దర్శకత్వంలో నయనతారతో కలిసి మూకుతి అమ్మన్2 లో నటిస్తున్నారు రెజీనా.
