ఆన్- స్క్రీన్ జంట తెగ షికార్లు.. ఏంటి కథ?
ఏ సినిమాకు అయినా హీరో హీరోయిన్ ముఖ్యమన్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో దర్శకులు.. తమ రాసుకున్న లేదా తమ వద్ద ఉన్న మూవీ స్టోరీకి తగ్గట్లు సెలెక్ట్ చేసుకుంటారు.
By: Tupaki Desk | 26 July 2025 11:07 AM ISTఏ సినిమాకు అయినా హీరో హీరోయిన్ ముఖ్యమన్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో దర్శకులు.. తమ రాసుకున్న లేదా తమ వద్ద ఉన్న మూవీ స్టోరీకి తగ్గట్లు సెలెక్ట్ చేసుకుంటారు. వారు ఓకే అంటే.. రంగంలోకి దించి షూటింగ్ ను జరుపుతారు. అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమాను రిలీజ్ చేస్తారు.
అదంతా ఎప్పుడూ జరుగుతున్నదే. అయితే సినిమా షూటింగ్ టైమ్ లో హీరోహీరోయిన్స్ చాలా దగ్గరవుతారు. కలిసి నటించాలి కాబట్టి క్లోజ్ గా మెలుగుతుంటారు. సెట్స్ లో దాదాపు ఎప్పుడూ కలిసే కనిపిస్తుంటారు. తరచూ కలిసి డిన్నర్స్, లంచ్ చేస్తుంటారు. అలా స్పెండ్ చేస్తూ ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత వారు నటించిన సినిమా రిలీజ్ అయ్యాక.. అప్పుడప్పుడు కలిస్తే మాట్లాడుకుంటారు. కొందరు ఫ్రెండ్స్ గా మారుతుంటారు. మరికొందరు హాయ్ అంటే హాయ్ అన్నట్లు ఉంటారు. కానీ ఇప్పుడు ఓ ఆన్ స్క్రీన్ జంట.. తాము నటించిన టైమ్ లో ఎలా స్పెండ్ చేశారో.. ఇప్పుడు కూడా అలానే స్పెండ్ చేయడం హాట్ టాపిక్ అయింది.
కొంత కాలం క్రితం వారిద్దరూ కలిసి ఓ సినిమా చేయగా.. ఆ టైమ్ లో ఇద్దరూ క్లోజ్ అయ్యారు. అదే సమయంలో వారి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ ఫుల్ గా చక్కర్లు కొట్టాయి. ఆ సినిమా టైమ్ లో తన సీన్స్ కాకపోయినా కూడా సదరు హీరోయిన్ సెట్స్ కు వెళ్లేదని, అక్కడ హీరోతో సమయం గడుపుతూ అక్కడే లోనే ఉండేదని వినికిడి.
విదేశాల్లో హీరోపై సన్నివేశాలు చిత్రీకరించిన సమయంలోనూ ఆమె అక్కడికి కూడా వెళ్లిందని సమాచారం. షూటింగ్ పేరుతో ఇద్దరూ విదేశాల్లో చక్కర్లు కొట్టారని తెలుస్తోంది. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తి అయింది. థియేటర్స్ లో కూడా ఇటీవల రిలీజ్ అయింది. కానీ అనుకున్నట్లు బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ ను మెప్పించలేక పోయింది.
అయితే ఇప్పుడు కూడా ఆ హీరో హీరోయిన్స్ కలిసే కనిపిస్తున్నారు. సదరు కథానాయకుడి నటిస్తున్న ఇతర సినిమా సెట్స్ కు ఆమె వెళ్లకపోయినా.. ఖాళీ సమయంలో ఇద్దరూ చిల్ అవుతున్నారు. దీంతో వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఉందని అనేక మంది నెటిజన్లు ఊహిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో వారికే తెలియాలి.
