Begin typing your search above and press return to search.

ఆలియా ప్ర‌వేశంతో సౌదీ షేక్

డెడ్‌లైన్ వివ‌రాల‌ ప్రకారం... రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ CEO మొహమ్మద్ అల్-టర్కీ ఈ వేడుక‌ల సారాంశం గురించి ఇలా అన్నారు

By:  Tupaki Desk   |   8 Dec 2023 7:16 AM GMT
ఆలియా ప్ర‌వేశంతో సౌదీ షేక్
X

సౌదీ అరేబియా-జెడ్డాలో బాలీవుడ్ సెల‌బ్రిటీల హంగామా ఇప్పుడు చ‌ర్చనీయాంశం. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తార‌ల త‌ళుకుబెళుకులు ఆక‌ర్షిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు భామ‌లు రెడ్ కార్పెట్ వాక్ ల‌కు సంబంధించిన ఫోటోషూట్లు వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఆలియా భ‌ట్ ఆఫ్-షోల్డర్ గౌనులో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అద్భుతమైన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.


సౌదీ అరేబియా- జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ మూడో ఎడిషన్ కోసం భారీగా తారాగ‌ణం త‌ర‌లి వెళ్లారు. తాజాగా షేర్ చేసిన ఫోటోతో పాటు.. ఆలియా సింపుల్ కొటేష‌న్ ని షేర్ చేసారు. ''స్మైల్ .. మెరుపు.. సౌదీ'' అని వ్యాఖ్య‌ను జోడించింది. ఇంత‌కుముందు ఎంబ్రాయిడరీ చేసిన న్యూడ్ ఆఫ్-షోల్డర్ షిమ్మరీ టాప్‌తో మ్యాచింగ్ లాంగ్ స్కర్ట్ తో క‌నిపించిన ఆలియా ఇంత‌లోనే హాఫ్ షోల్డ‌ర్ గులాబీ డిజైన్ ల‌తో కూడిన దుస్తుల్లో క‌నిపించింది.


ఫెస్టివల్ మూడవ ఎడిషన్‌లో హాలీ బెర్రీ - గ్వినేత్ పాల్ట్రో వంటి హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఆలియా 'ఇన్-కన్వర్సేషన్' సైడ్‌బార్ విభాగంలో చేరనుందని తెలిసింది. ఇక ఇదే వేదిక వ‌ద్ద రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, బాలీవుడ్ లెజెండ్ కరణ్ జోహార్ క‌నిపించారు. యాస్మిన్ సబ్రీ, విల్ స్మిత్ లాంటి హాలీవుడ్ లెజెండ్ లు ఎటెండ‌య్యారు.

డెడ్‌లైన్ వివ‌రాల‌ ప్రకారం... రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ CEO మొహమ్మద్ అల్-టర్కీ ఈ వేడుక‌ల సారాంశం గురించి ఇలా అన్నారు. ''ఈ సంవత్సరం ఇన్ కన్వర్సేషన్ లైనప్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ నుంచి కొన్ని పాపుల‌ర్ పేర్లు ఉన్నాయి. ఫెస్టివ‌ల్ అనేది సినిమా రంగంలో ప‌ని విష‌య‌మై ప్రేర‌ణ‌ అందించడానికి ఉప‌క‌రిస్తుంది. మన ఊహలను నిజం చేస్తూ, వెలుగులోకి తెచ్చే మల్టీహైఫెనేట్ సృష్టికర్తల నుండి.. అంద‌మైన‌ కథలకు జీవం పోసే న‌టీనటుల వరకు - ఈ వేదిక‌కు విచ్చేస్తున్నారు..'' అన్నారాయన.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దర్శకుడు వాసన్ బాలా తెర‌కెక్కించ‌నున్న 'జిగ్రా'లో ఆలియా న‌టించ‌నుంది. ఈ చిత్రం 27 సెప్టెంబర్ 2024న థియేటర్లలోకి వ‌స్తుంది. ప్రియాంక చోప్రా- కత్రినా కైఫ్‌లతో పాటు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తదుపరి చిత్రం 'జీ లే జరా'లోను ఆలియా న‌టించ‌నుంది.