Begin typing your search above and press return to search.

ప్రభాస్ కు ఈ టెన్షనమిటో..

వివరాళ్లోకి వెళ్లితే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్ మొదటి భాగంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ ఇతర సినిమాలకు తలనొప్పిగా మారింది

By:  Tupaki Desk   |   12 Sep 2023 6:08 AM GMT
ప్రభాస్ కు ఈ టెన్షనమిటో..
X

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళట్లేదన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాయి. రీసెంట్ గా ఆదిపురుష్ తో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం కొత్త చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రస్తుతం సందిగ్ధతను ఎదుర్కొంటున్నాయి. కానీ ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురౌతున్నారు.

వివరాళ్లోకి వెళ్లితే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్ మొదటి భాగంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ ఇతర సినిమాలకు తలనొప్పిగా మారింది. అసలీ చిత్రాన్ని సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వదులుతానన్నారు. కానీ ఇప్పుడు అనుకోని కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడస్తందో తెలీక అటు అటుభిమానులు నిరాశపడుతుంటే.. మరోవైపు ఇతర చిత్రబృందాలు కొత్త రిలీజ్ డేట్ బాంబ్ తమపై ఎక్కడ పడుతుందా అని ఆందోళ చెందుతున్నారు.

ఇక నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక సినిమా సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి..2898ఏడీ. ఈ చిత్ర విడుదల తేదీపై స్పష్టతే లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మొదట్లో మేకర్స్ చెప్పినప్పటికీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అస్సలు కనపడట్లేదు. షూటింగ్ ఎంత వరకు వచ్చిందో కూడా తెలియట్లేదు. మేకర్స్ ఈ సినిమా విషయంలో తమ విజన్ కు తగ్గట్టు ఔట్ పుట్ అందుకునేసరికి చాలా సమయమే పట్టేట్టు కనపడుతోంది. కాబట్టి ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో తెలీదు.

ప్రభాస్.. దర్శకుడు మారుతీతోనూ సీక్రెట్ గా ఓ హారర్ మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకుండా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ కూడా బయటకు రాలేదు. కనీసం దీని గురించి ఎటువంటి ప్రచారం కూడా జరగట్లేదు. ఇక ప్రభాస్ రీసెంట్ గా మరో సినిమాను కూడా ఒప్పుకున్నారు. మంచు విష్ణు మైథలాజికల్ భక్త కన్నప్ప సినిమాలో శివుడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఎప్పుడు వస్తుందో.

ఇక ఆదిపురుష్ నిర్మాత భుషన్ కుమార్ తో కలిసి ప్రభాస్ స్పిరిట్ అనే మరో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూషన్.. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే అదే సమయంలో సలార్ రెండో భాగం కూడా ఉంటుంది.

మొత్తంగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేస్తున్నారు కానీ అవి అనుకున్న సమయానికి వచ్చేట్టు అస్సలు కనపడట్లేదు. అలానే ఇప్పటికే ఆయన నటించిన సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను అయితే అందుకుంటున్నాయి కానీ ఒక్కటి కూడా సక్సెస్ ను అందుకోవట్లేదు. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రభాస్ లాభాలు తెచ్చిపెడతాడనుకుంటే.. నష్టాలు ఎక్కువైపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలోనూ ఫ్యాన్స్ కు టోటల్ కన్ఫ్యూజన్ నెలకొంది. ఆయన లుక్స్ కూడా ఛేంజ్ అయిపోతున్నాయి. కాబట్టి ప్రభాస్ తన సినిమాల విషయంలో కాస్త ఆలోచించి, ఒకదాని తర్వాత మరొకటి ఒప్పుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్లాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.