Begin typing your search above and press return to search.

సంక్రాంతికి రెబల్స్‌ కు కన్నుల విందు కన్ఫర్మ్‌..!

మరో వైపు అదే సంక్రాంతి కోసం యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:30 PM GMT
సంక్రాంతికి రెబల్స్‌ కు కన్నుల విందు కన్ఫర్మ్‌..!
X

ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందరు హీరోల ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఆయా సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. మరో వైపు అదే సంక్రాంతి కోసం యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

ప్రభాస్‌ సినిమా సలార్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయినా కూడా సంక్రాంతికి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా.. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించిన లుక్ ను రివీల్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అందుకే రెబల్‌ ఫ్యాన్స్ సంక్రాంతి కోసం వెయిట్‌ చేస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా విడుదల అవ్వబోతున్న మారుతి సినిమా ప్రభాస్ అవతార్‌ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు.

ముఖ్యంగా సినిమా సెకండ్‌ హాఫ్ లో ప్రభాస్ కనిపించే లుక్ కి ఫ్యాన్స్‌ కానివారు కూడా వావ్‌ అనాల్సిందేనట. ఆయన హెయిర్ స్టైల్‌ తో పాటు, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాల్లో కూడా మారుతి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఆ విషయాన్ని కూడా మారుతి క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయం పై కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి ప్రభాస్ ఫ్యాన్స్ కి కన్నుల విందు కన్ఫర్మ్‌ అన్నట్లుగా చర్చ జరుగుతోంది.