Begin typing your search above and press return to search.

పొట్టి డ్రెస్ లో రెబా.. యమా అందంతో వారెవ్వా!

ముద్దుగుమ్మ, హీరోయిన్ రెబా మోనిక జాన్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది అమ్మడు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 8:37 PM IST
పొట్టి డ్రెస్ లో రెబా.. యమా అందంతో వారెవ్వా!
X

ముద్దుగుమ్మ, హీరోయిన్ రెబా మోనిక జాన్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది అమ్మడు. తన యాక్టింగ్ అండ్ గ్లామర్ తో యూత్ లో మంచి ఫేమ్ రెబా సొంతం. అదే సమయంలో నెట్టింట బ్యూటీ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఆమె పిక్స్ వైరలవుతుంటాయి.

తన ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు తరచూ ట్రీట్స్ ఇచ్చే రెబా.. ఇప్పుడు ఫారిన్ ట్రిప్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. థాయిలాండ్ లో ప్రస్తుతం చిల్ అవుతున్న అమ్మడు.. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందరినీ ఆకట్టుకుంటున్నాయి కూడా.


"ఎప్పటి నుంచో ఫ్యామిలీ ట్రిప్ కు వెళ్దామనుకుంటున్నా. కానీ పోస్ట్ పోన్ అవుతుంది. ఎట్టకేలకు ఇప్పుడు వెళ్లాను. థాయ్ ల్యాండ్ లో ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశాం. ఈ ట్రిప్ చాలా స్పెషల్. పుకెట్ లో బెస్ట్ థాయ్ ఫుడ్ ఆస్వాదించాం. పెర్ఫెక్ట్ టూర్ గైడ్ దొరికాడు. మా వైబ్, ఎనర్జీకి సరిపోయారు" అంటూ రాసుకొచ్చింది రెబా.


అయితే రెబా పోస్ట్ చేసిన పిక్స్ లో తన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆమె మాత్రం తన అందంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ లో సందడి చేసిన అమ్మడు ఇచ్చిన పోజులు చాలా క్యూట్ గా ఉన్నాయి. సూపర్ పిక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ మేడమ్ అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు.


కాగా, రెబా కెరీర్ విషయానికొస్తే.. మలయాళం మూవీ జాకోబింటె స్వర్గరాజ్యంతో సినీ ఇండస్ట్రీలోకి ఆమె అడుగులు పడ్డాయి. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే కనిపించింది అమ్మడు. ఫోరెన్సిక్, జరుగండి, బిగిల్, మైఖేల్, ఎఫ్.ఐ.ఆర్, బూ తదితర కోలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిందనే చెప్పాలి.

అయితే సామజవరగమన మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువైంది రెబా. అందులో ఆమె యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. కాస్త గ్యాప్ తీసుకుని రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ మూవీలోని స్వాతి రెడ్డి సాంగ్ తో కుర్రకారును ఊపేసింది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ, దళపతి విజయ్ జన నాయగన్, సకల కళా వల్లభ చిత్రాలతో బిజీగా ఉంది. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.