కమిట్‌మెంట్ అడిగారంటూ ఓపెనైన నటి
తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి షాకిచ్చింది.
By: Tupaki Desk | 2 April 2025 12:50 AM ISTటాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది రెబా మోనికా జాన్. `జారుకండి` అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రెబా తెలుగులోను పలు చిత్రాల్లో నటించింది. శ్రీవిష్ణు `సమాజవరగమన`లో నటించింది. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ లో చిన్న పాత్రలో నటించింది. కానీ పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఈ సందర్భంగా మ్యాడ్ స్క్వేర్ లో అవకాశం కల్పించిన నిర్మాతలు, ఇతర బృందానికి రెబా మోనికా జాన్ అభినందనలు తెలిపింది.
తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి షాకిచ్చింది. అవకాశాల కోసం వెతుకుతున్న క్రమంలో తనను కమిట్ మెంట్ అడిగారని చెప్పిన రెబా.. కొందరైతే డేటింగ్ కి వస్తావా? అని కూడా అడిగినట్టు తెలిపింది. కొందరు ఎలాంటి భయం లేకుండా ఇలాంటివి అడిగేస్తారని తెలిపింది.
రెబా తనదైన అందం, నటన, అద్భుతమైన స్పీచ్ లతో హృదయాలను గెలుచుకుంటోంది. టాలీవుడ్ కోలీవుడ్ సహా మాలీవుడ్ లోను నటిస్తోంది. రెబా కాస్టింగ్ కౌచ్ అనుభవంపై ఓపెన్ అయిన వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఐదేళ్ల క్రితం మీటూ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది కథానాయికలు లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు. రెబా మౌనిక ఇప్పుడు ఓపెన్ గా తనకు ఎదురైన వేధింపుల గురించి ప్రకటించింది. అయితే బహిరంగంగా వేదికలపై ఇలాంటి ప్రకటనలు చేసేవారికి ఇటీవల అవకాశాలు తగ్గుతున్నాయ్. అయినా ధైర్యంగా మాట్లాడకపోతే ఎప్పటికీ ఈ పరిస్థితి మారదు.
