Begin typing your search above and press return to search.

శ్రీలీల సినిమాలకు బ్రేక్ అందుకేనా..?

అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే పీక్స్ లోకి వెళ్లిన అమ్మడు ఏకంగా సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యిందట.

By:  Tupaki Desk   |   23 Aug 2023 6:45 AM GMT
శ్రీలీల సినిమాలకు బ్రేక్ అందుకేనా..?
X

కన్నడ భామ శ్రీ లీల తెలుగులో టాప్ లేపేస్తుంది. వరుస క్రేజీ ఛాన్స్ లతో అమ్మడు అదరగొట్టేస్తుంది. మొదటి సినిమా పెళ్లిసందD పెద్దగా ఆడకపోయినా అమ్మడిలో టాలెంట్ గుర్తించిన రవితేజ ధమాకా ఛాన్స్ ఇవ్వగా ఆ సినిమాతో ఆమె యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ముఖ్యంగా యాక్టింగ్ తోనే కాదు తన డ్యాన్స్ మూమెంట్స్ తో శ్రీ లీల కిరాక్ అనిపించేస్తుంది. ఆ ఇమేజ్ తోనే అమ్మడు యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు క్రేజీ సినిమాలు చేస్తుంది.

పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ తో గుంటూరు కారం చేస్తున్న శ్రీ లీల వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు కూడా చేస్తుంది. చేతినిండా దాదాపు పది సినిమాలతో శ్రీ లీల తన సత్తా చాటుతుంది. ఈ నెల నుంచి వరుసగా ఐదు నెలల పాటు నెలకో సినిమా రిలీజ్ అవుతూ రచ్చ చేస్తుంది శ్రీ లీల. అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే పీక్స్ లోకి వెళ్లిన అమ్మడు ఏకంగా సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యిందట.

అదేంటి ఇప్పుడే కదా కెరీర్ మొదలైంది అప్పుడే బ్రేక్ ఏంటి అనుకోవచ్చు శ్రీ లీల ఉన్నపలంగా ఒక రెండు నెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట. నవంబర్, డిసెంబర్ రెండు నెలలు తన డేట్స్ ఇవ్వలేనని చెబుతుందట. అలా ఎందుకు అంటే ఓ పక్క యాక్టర్ గా చేస్తూనే డాక్టర్ గా కూడా తన ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసే పనిలో ఉంది అమ్మడు. ఎం.బి.బి.ఎస్ ఫైనల్ ఇయర్ లో ఉన్న శ్రీ లీల ఆ పరీక్షలను పూర్తి చేసేందుకే ఈ రెండు నెలలు గ్యాప్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఆ పరీక్షలు పూర్తి చేశాక మళ్లీ అమ్మడు సినిమాలు చేస్తుందట.

టాలీవుడ్ లో క్రేజీ ఛాన్స్ లతో దూకుడు చూపిస్తున్న శ్రీ లీల తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుని టాలీవుడ్ టాప్ ప్లేస్ దక్కించుకోవాలని చూస్తుంది. స్టార్ హీరోల సరసన నటిస్తున్న అమ్మడికి ఇప్పటికే స్టార్ ఇమేజ్ రాగా ఆ సినిమాలు హిట్లు పడితే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రానంత క్రేజ్ తెచ్చుకున్న శ్రీ లీల రానున్న రోజుల్లో టాలీవుడ్ ని ఏలేస్తుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వరుస సినిమాలు రిలీజ్ లతో రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది శ్రీ లీల.